శ్రీదేవి మ‌ర‌ణాన్ని బిగ్ బీ ముందే ఊహించారా ?

Submitted by arun on Sun, 02/25/2018 - 10:41
sr

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ చేసిన ఓ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీనియర్‌ నటి శ్రీదేవి మరణవార్త మీడియాలో రావటం కంటే ముందే ఆయన ఓ ట్వీట్‌ చేశారు. అయితే ఆ ట్వీట్‌ ఆమె మృతికి సంబంధించిందేనంటూ ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది. 'ఎందుకో తెలియదు. ఎన్నడూ లేనంత ఆందోళనకు గురవుతున్నా' అంటూ బిగ్ బీట్వీట్ చేశారు. అంటే త‌న‌ సిక్త్ సెన్స్‌తో శ్రీదేవి మ‌ర‌ణాన్ని బిగ్ బీ ముందుగానే ఊహించాడా అంటూ చ‌ర్చించుకుంటున్నారు.

English Title
amitabh bachchan weird tweet sridevi death

MORE FROM AUTHOR

RELATED ARTICLES