బిగ్ బీ అమితాబ్ ఇంట విషాదం..  

Submitted by arun on Mon, 08/06/2018 - 16:02
bachan

బాలీవుడ్ సూపర్ స్టార్ వియ్యంకుడు, ఎస్కార్ట్స్ గ్రూప్ అధినేత రాజన్ నందా ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఈ ఘటన తో బచ్చన్ కుటుంబంలో విషాదం నెలకొంది. కొన్ని రోజులుగా రాజన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. బ్రహ్మాస్త్ర షూటింగ్ కోసం ప్రస్తుతం బల్గేరియాలో ఉన్నారు అమితాబ్. వియ్యంకుడి మృతి విషయం తెలుసుకోగానే హుటాహుటిని ఇండియాకు బయలు దేరారు. 

ఈ విషయాన్ని అమితాబ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘నా బంధువు రాజన్ నందా, నిఖిల్ తండ్రి, శ్వేత(బిగ్ బీ కూతురు) మామగారు ఇంతకుముందే కన్నుమూశారు. నేను ఇండియాకు వెళ్తున్నాను.’ అంటూ పేర్కొన్నారు. రాజన్ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అమితాబ్ బచ్చన్ కుమార్తె శ్వేతను రాజన్ నందా కుమారిడికి ఇచ్చి వివాహం జరిపించిన సంగతి తెలిసిందే.

English Title
Amitabh Bachchan rushes to India as daughter Shweta Bachchan’s father-in-law Rajan Nanda dies

MORE FROM AUTHOR

RELATED ARTICLES