తన దీర్ఘకాలిక వ్యాధిని వెల్లడించి షాకిచ్చిన అగ్రహీరో

Submitted by arun on Thu, 11/22/2018 - 14:53
Amitabh Bachchan

తన గురించి అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని చెప్పాడు. తన వెన్నెముకకు ప్రమాదకరమైన క్షయ వ్యాధి సోకిందని అమితాబ్ అన్నారు. 'కౌన్ బనేగా కరోడ్ పతి' తాజా సీజన్‌లో ఓ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ భయంకర నిజాన్ని బయటపెట్టాడు.       
2000వ సంవత్సరంలో కేబీసీ ప్రారంభించిన సమయంలో తనకు వెన్నుపాము సంబంధిత క్షయవ్యాధి ఉందని గుర్తించడం జరిగిందన్నారు. తరువాత తగిన చికిత్స తీసుకోవడంతో ఇప్పుడిప్పుడే దాని బారినుంచి బయటపడినట్టు తెలిపారు. ఈ వ్యాధి కారణంగా తానెన్నో ఇబ్బందులు పడ్డానని, కుర్చీలో కూర్చున్నప్పుడు ఎంతో నొప్పివచ్చేదని తెలిపారు. ఈ వ్యాధి నివారణకు చాలా మందులు వాడాల్సి వచ్చిందన్నారు. ఇటువంటి వ్యాధితో చాలామంది బాధపడుతున్నారని, దీనిపై ప్రజల్లో మరింత అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని అమితాబ్ తెలిపారు.

English Title
amitabh bachchan reveals in kbc suffered from tuberculosis symptoms

MORE FROM AUTHOR

RELATED ARTICLES