ఈనెల 16 న అమెజాన్ భారీ డిస్కౌంట్..

Submitted by nanireddy on Tue, 07/03/2018 - 17:55
amezon huge discount offer on julay 16

 సరిగ్గా జులై 16 న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్.. భారీ డీల్ కు తెరతీయబోతోంది. అమెజాన్ ప్రైమ్ వార్షికోత్సవం సందర్బంగా పలు ఆఫర్లతో ముందుకువస్తోంది. 36 గంటలపాటు ఈ అవకాశం అందుబాటులో ఉండనుంది. గతేడాది కేవలం 30 గంటలు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఆఫర్ ఈ ఏడాది 36 గంటలపాటు ఉంటోంది.. అమెజాన్ ప్రైమ్ డే టు డేట్ లో.. ఆస్ట్రేలియా, లక్షంబర్గ్ , నెథర్లాండ్, సింగపూర్ అలాగే యూఎస్, యూకే, స్పెయిన్, ఇండియా, మెక్సికో, జపాన్, ఇటలీ, జెర్మనీ, ఫ్రాన్స్, చైనా, కెనడా, బెల్జియం, ఆస్ట్రియా తదితర దేశాల్లో ఈ డీల్ అందుబాటులో ఉండనుంది. గతేడాది అమెజాన్ ప్రైమ్ డే లో టీవీ, స్మార్ట్ హోమ్, కిచెన్, గ్రోసరీ, టాయ్స్, ఫాషన్, ఫర్నిచర్, అప్లయెన్సెస్, నిత్యావసరాలకు సంబంధించిన పలు వస్తువులు అందుబాటులో ఉన్నాయి.

వాస్తవానికి, అమెజాన్ తన సొంత బ్రాండ్ పరికరాలను 'ప్రైమ్ డే' కోసం ఆఫర్ చేస్తోంది, ఒప్పందాల్లో కొన్నింటిని ముందుగానే వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఫైర్ టివి, ఫైర్ టాబ్లెట్స్ మీద అతి తక్కువ ధరలతో అమెజాన్ పరికరాలపై "డబుల్ డీల్స్" అందించనున్నట్టు అమెజాన్ తెలిపింది. కాగా ఈ ఏడాది 'సరికొత్త హోమ్ సెక్యూరిటీ' డివైసెస్ ను ఈ డీల్ ద్వారా అందుబాటులోకి తేనుంది.

ఈ ప్రైమ్ డే రోజు అమెజాన్ స్టోర్ లో షాపింగ్ చేసిన వారికీ10 శాతం ఆఫర్ ఇవ్వనుంది. అలాగే వందల వస్తువులపై భారీ తగ్గింపు ఇవ్వనున్నట్టు అమెజాన్ తెలిపింది. ప్లస్ ప్రైమ్ రివార్డ్స్ వీసా కార్డు కలిగివున్నవారికి ప్రత్యేక బహుమతులు అందుకుంటారని తెలిపింది - 10 శాతం ఆఫర్ అమౌంట్ తిరిగి జూలై 14 నుండి 17 మధ్య ఇవ్వనున్నట్టు తెలిపింది. కానీ కచ్చితంగా ప్రైమ్ మెంబర్షిప్ ఉండాలి అని చెబుతోంది. అయితే ఇండియాలో అమెజాన్ స్టోర్లు లేకపోవడం గమనార్హం. 

ఇప్పటికే సేల్ అవుతున్న వస్తువులపై డెస్కౌంట్లు ఇలా ఉన్నాయి..

*ఎకో షో – save $100 (సాధారణంగా $229). *అమెజాన్ ప్రొడక్ట్స్.. ఫర్నిచర్ మరియు డెకార్స్ పై 25 శాతం, అమెజాన్ బేసిక్ ఐటమ్స్ పై 20 శాతం, నిత్యావసర వస్తువులపై 30 శాతం ఆఫర్ ఇవ్వనుంది. *అలాగే అమెజాన్ ప్రైమ్ సెలెక్టెడ్ మూవీ.. డీవీడీ, బ్లూరే లపై 50 శాతం ఇస్తుంది.

English Title
amezon huge discount offer on julay 16

MORE FROM AUTHOR

RELATED ARTICLES