సైరా.. ఈ రికార్డ్ నీకే సాధ్యంరా!

సైరా.. ఈ రికార్డ్ నీకే సాధ్యంరా!
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో.. మరోసారి టాలీవుడ్ కు తెలిసొచ్చింది. చిరు సినిమా వస్తోందంటే.. ఎలాంటి హంగామా ఉంటుందన్నది కాదు.. ఆ హంగామా ఏ స్థాయిలో...

మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో.. మరోసారి టాలీవుడ్ కు తెలిసొచ్చింది. చిరు సినిమా వస్తోందంటే.. ఎలాంటి హంగామా ఉంటుందన్నది కాదు.. ఆ హంగామా ఏ స్థాయిలో ఉంటుందన్నది కూడా మరోసారి సంచలనంగా మారింది. ఖైదీ నంబర్ 150 సినిమాతో గ్రాండ్ గా వంద కోట్ల కలెక్షన్లతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. ఇప్పుడు 151వ సినిమాగా సైరా అంటూ ముస్తాబవుతున్నాడు.

ఇంకా షూటింగ్ కూడా పూర్తి చేసుకోని ఈ సినిమా.. అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టింది. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్.. మేకింగ్ వీడియోలు.. టీజర్లు.. ట్రైలర్ల హక్కులన్నింటినీ ఏకంగా 30 కోట్ల రూపాయలు పెట్టి అమెజాన్ సంస్థ దక్కించుకుందన్న విషయం.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంత పెద్ద మొత్తం పెట్టి అమెజాన్ సంస్థ ఓ సినిమాను కొనుగోలు చేయడం కూడా ఇదే ప్రథమమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

భారీ తారాగణంతో ముస్తాబవుతున్న ఈ సినిమా.. ఇండస్ట్రీలో మాంఛి బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అవుతూనే ఉంది. హీరోయిన్ గా నయనతార.. ప్రత్యేక పాత్రలో అమితాబ్ బచ్చన్.. సినిమాకు అత్యంత కీలకం కానున్నారు. ఇలా.. కాంబినేషన్ తోనే సంచలనంగా మారిన సైరా సినిమా.. ఇప్పుడు అమెజాన్ వాళ్ల లెక్కలతో మరోసారి వార్తల్లో నిలిచింది. దీంతో.. చిరు ఫ్యాన్స్ మరోసారి కాలర్ ఎగరేస్తున్నారు. తమ గ్యాంగ్ లీడర్ కు ప్రత్యామ్నాయం లేదని గర్వంగా చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories