స్టైలిష్ ను ఎలా మ‌రిచి పోగ‌ల‌ను

Submitted by lakshman on Sat, 02/17/2018 - 00:31
Allu arjun Impressed With Priya warrier

ప్రియా ప్రకాశ్ వారియర్ 20 సెక‌న్ల వీడియోలో ఆమె చూసిన చూపు దేశ వ్యాప్తంగా ఆస‌క్తిక‌రంగా మారింది. ‘ఒరు ఆధార్ లవ్’ చిత్రంలోని ఓ పాటలో క‌న్ను గీటిన వారియ‌ర్ అభిమానుల్ని ఫిదా చేసింది. దీంతో ఓవ‌ర్ నైట్ స్టార్ డంను సంపాదించింది. ఏ అభిమాని, ఏ ఇండ‌స్ట్రీ అయినా యాక్ట‌ర్ల‌తో సంబంధం లేకుండా వారియ‌ర్ ను ఇష్ట‌ప‌డేందుకు వెనుకాడ‌డంలేదు. 
అంతేకాదు ఇటీవలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ అమ్మాయి చూపులకు పడిపోయి ‘ఈ మధ్య కాలంలో ఇంత క్యూటెస్ట్ వీడియోని నేనసలు చూడలేదు. సింప్లిసిటీకి ఉన్న పవరే ఇది. నాకు బాగా నచ్చింది’ అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఆమె స్టార్ డం ను  దెబ్బ‌కొట్టేలా కొంత‌మంది ఆమెపై కేసులు పెట్టి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అయితే  కేర‌ళ సీఎం కూడా వారియ‌ర్ కు అండ‌గా నిలిచారు. 
కేర‌ళ‌లో భావ‌న ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌పై అస‌హ‌నాన్ని ఆమెదించ‌బోమ‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. వారియ‌ర్ యాక్ట్ చేసిన పాటను 1978లో ఆకాశ వాణిలో ప్ర‌సారం చేసార‌ని అన్నారు.  మపిల్ల పట్టు అనే ముస్లిం సంప్రదాయ పాట ఆధారంగా పీఎంఏ జబ్బార్ రాసిన గేయాన్ని రఫీఖ్ పాడారని తెలిపారు.  ముస్లింల వివాహాల్లో ఈ పాటను దశాబ్దాలుగా పాడుతూనే ఉన్నారని విజయన్ పేర్కొన్నారు. ఛాందసవాదం, మతతత్వంపై పోరాటానికి కళలు, సాహిత్యం ఆయుధాలని ఆయన తెలిపారు.  
అయితే తాజాగా ఓ మళయాళ టీవీ ఛానల్ షో లో పాల్గొన్న ప్రియా.. అల్లు అర్జున్ ఇచ్చిన కామెంట్ పట్ల రియాక్ట్ అయింది. ‘అభిమానుల నుండి వచ్చిన ఇంతటి ఆదరణతో పాటు ముఖ్యంగా అల్లు అర్జున్ ఇచ్చిన కాంప్లిమెంట్ మాత్రం మరపురానిది. కేరళలో అల్లు అర్జున్ కి ఎంతోమంది అభిమానులున్నారు’ అని చెప్పుకొచ్చింది ప్రియా.

English Title
Allu arjun Impressed With Priya warrier

MORE FROM AUTHOR

RELATED ARTICLES