నాదీ జనసేనే..కానీ..! : అల్లు అర్జున్

Submitted by arun on Mon, 04/09/2018 - 14:23
Allu Arjun,

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పడు అల్లు అర్జున్, రామ్ చరణ్ లు ఆ పార్టీ కోసం ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు రాజకీయాల గురించి అల్లు అర్జున్ మాట్లాడలేదు. చిరంజీవిది ఏ పార్టీ అయితే తనదీ అదే పార్టీ అని చెబుతూ ఉన్నాడు. మరోవైపు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించినప్పటి నుంచి ఇంత వరకు ఆ పార్టీపై బన్నీ స్పందించలేదు. తాజాగా ఓ ఇటర్వ్యూలో బన్నీకి దీనికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

దానికి సమాధానంగా... ‘‘నేను రాజకీయాల గురించి మాట్లాడాలంటే.. ముందు చిరంజీవిగారు రాజకీయాల గురించి ఏం చెబుతారో, ప్రస్తుత రాజకీయాలపై ఆయన అభిప్రాయం ఏమిటో తెలియాలి. ఎందుకంటే చిరంజీవిగారిది ఏ పార్టీ అయితే నాది కూడా అదే పార్టీ. ప్రస్తుతం ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ కాదని.. తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు మద్ధతు తెలుపుతూ.. జనసేన అంటే నాది కూడా జనసేనే. నేను ఆయన మనిషిని. చిరంజీవిగారు ఏం చెబితే అదే నా మాట. నాకంటూ పొలిటికల్ స్టాండ్ ఏమీ లేదు. చిరంజీవిగారి దారే నాదారి..’’ అంటూ ప్రస్తుత రాజకీయాలపై, జనసేనపై తన అభిప్రాయాన్ని తెలిపారు అల్లు అర్జున్.

English Title
Allu Arjun about Pawan Kalyan’s Party

MORE FROM AUTHOR

RELATED ARTICLES