నరాలు తెగే ఉత్కంఠకు తెరపడాలంటే...మరి కొన్ని గంటలు

నరాలు తెగే ఉత్కంఠకు తెరపడాలంటే...మరి కొన్ని గంటలు
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈనెల 11న 31 జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల...

తెలంగాణ అసెంబ్లీ ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈనెల 11న 31 జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి వరుసగా నియోజకవర్గాల ఫలితాలు వెల్లడికానున్నాయి. మధ్నాహ్నం 2.15 గంటలకు అన్నింటి లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. మొదట్లో చార్మినార్ ఫలితం, చివర్లో యాకుత్ పుర ఫలితాలు రానున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఓట్ల లెక్కింపుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈనెల 11న 31 జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం 44 కేంద్రాలను సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన 44 లెక్కింపు కేంద్రాల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 13 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 2 కేంద్రాలు సిద్ధమయ్యాయి. మిగిలిన జిల్లాల్లో ఒక్కో కేంద్రం చొప్పున ఏర్పాటు చేశారు.


హైదరాబాద్‌‌లోని ముషీరాబాద్‌, నాంపల్లి నియోజకవర్గాల ఓట్లను ఎల్బీ స్టేడియంలో, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాల ఓట్లను యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మైదానంలో లెక్కిస్తారు. మిగిలిన 11 నియోజకవర్గాల ఓట్లను వేర్వేరు ప్రాంతాల్లో కౌంటింగ్ చేయనున్నారు. పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను బట్టి ఒక నియోజకవర్గానికి 14+1 బెంచీలు ఏర్పాటు చేస్తారు. ఒక బెంచీపై ఆర్‌వో, పరిశీలకుడు ఉంటారు. వాళ్లు నిరంతరం లెక్కింపును పర్యవేక్షిస్తూ.. ఎప్పటికప్పుడు ఫలితాలను వెల్లడిస్తారు. మిగిలిన బెంచీల్లో ఒక్కోదానిపై కౌంటింగ్‌ ఏజెంట్‌, కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, అసిస్టెంట్‌ సూపర్‌వైజర్‌, మైక్రో అబ్జర్వర్‌ కూర్చుని లెక్కింపులో నిమగ్నమవుతారు. పోలింగ్‌ కేంద్రాలు ఎక్కువగా ఉన్న మేడ్చల్‌లో 28+1 చొప్పున, తక్కువ కేంద్రాలున్న జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్‌, పాలకుర్తి నియోజకవర్గాల్లో 12+1 చొప్పున బెంచీలు ఏర్పాటు చేశారు. ఓట్ల కౌంటింగ్ లో తొలుత పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కించి, ఆ తర్వాత 30 నిమిషాలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ప్రతి నియోజకవర్గంలోనూ ఒక పోలింగ్‌ కేంద్రానికి సంబంధించిన వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కిస్తారు. ఆ పోలింగ్‌ కేంద్రాన్ని ర్యాండమైజేషన్‌ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియను పోటీ చేసిన అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో నిర్వహిస్తారు. వీవీప్యాట్‌ స్లిప్పుల సంఖ్యా, ఈవీఎంలో పోలైన ఓట్ల సంఖ్యా సరిపోలితే అక్కడ పోలింగ్‌ సక్రమంగా సాగినట్లు పరిగణిస్తారు. లెక్కింపు కేంద్రాల్లోకి సిబ్బంది సెల్‌ఫోన్లు తీసుకువెళ్లకూడదని ఆంక్షలు విధించారు.

నియోజకవర్గంలో పోలింగ్‌ కేంద్రాల సంఖ్య తక్కువగా ఉంటే ఆ ఫలితం త్వరగా వెల్లడవుతుంది. ఆ లెక్కన హైదరాబాద్‌ జిల్లాలో చార్మినార్‌ ఫలితం మొదట వస్తుందని అధికారుల తెలిపారు. యాఖుత్‌పుర చివరిది కానుంది. నమోదైన పోలింగ్‌ శాతం, బరిలోని అభ్యర్థుల సంఖ్య ఆధారంగా ఫలితాల ప్రకటన సమయం కొంత అటు, ఇటు మారే అవకాశం ఉంది. ఈ నెల 11న ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. ఆ లెక్కన మధ్యాహ్నం 12 గంటల నుంచి వరుసగా నియోజకవర్గాల ఫలితాలు వెల్లడికానున్నాయి. మధ్నాహ్నం 2.15 గంటలకు అన్నింటి లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ కు కొన్ని గంటలే మిగిలి ఉంది. ఓట్ల లెక్కింపుకు ఎలక్షన్ కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ పై సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీవో రజత్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇప్పటికే లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి ఈసీ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. లెక్కింపు ప్రక్రియ అంతా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ కు మరికొన్ని గంటలే మిగిలి ఉండటంతో ఫలితాలు ఎలా ఉంటాయన్నది టెన్షన్ మొదలైంది. ఓటరు నాడి అంతు చిక్కక అభ్యర్థులకు కంటిమీద కునుకు కరువైంది. పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి లాభం చేకూరుస్తుందో తెలియక ప్రధాన పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు అందరి ఫోకస్ కౌంటింగ్ కేంద్రాలపై పడింది. ఓట్ల గల్లంతు, పోలింగ్ శాతం ప్రకటించడంలో ఆలస్యం వంటి విమర్శలు ఎదుర్కొన్న ఎలక్షన్ కమిషన్ కౌంటింగ్ ను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. కౌంటింగ్ కు సంబంధించి సిబ్బందికి ప్రత్యేక శిక‌్షణ ఇచ్చింది ఈసీ . 119 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు 44 ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ లో అత్యధికంగా 13 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో రెండు , మిగతా అన్ని జిల్లాల్లో ఒక్కో లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేశారు.

ఒక్కో కేంద్రంలో 14 టేబుళ్లు , రిటర్నింగ్ అధికారికి మరో టేబుల్ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌ దగ్గర కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, అసిస్టెంట్‌ సూపర్‌వైజర్‌, మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు. ఓట్ల లెక్కింపు . లెక్కింపులో ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ల లెక్కింపు ఉంటుంది. కౌంటింగ్ ఏజెంట్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తారు. మొబైల్ ఫోన్లు, పేపర్లను కౌంటింగ్ హాల్‌లోకి అనుమతించరు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ అంతా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తారు. కౌంటింగ్ ఏర్పాట్లను ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షించారు. లెక్కింపు ప్రక్రియ, భద్రత చర్యలపై సూచనలు ఇచ్చారు. పార్టీల అభ్యర్థులు కూడా స్ట్రాంగ్ రూమ్ లను , కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories