మరోసారి రియల్ హీరో అనిపించుకున్న అక్షయ్ కుమార్

Submitted by nanireddy on Thu, 09/20/2018 - 20:11
akshay kumar gave 5laks rupies to lakshmi agahrwal

తాను కేవలం సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోనే అని అక్షయ్ కుమార్ మరోసారి నిరూపించుకున్నాడు. యాసిడ్ దాడికి గురై.. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న లక్ష్మి అగర్వాల్‌కి రూ.5 లక్షలు సాయం అందించాడు. ఇటీవల ఆమె గురించి ఓ వార్త పత్రిక ద్వారా తెలుసుకున్న అక్షయ్ కుమార్ సదరు బాధితురాలికి తనవంతు సాయం అందించి.. మరికొందరు ముందుకొచ్చి ఇలాంటి వారిని ఆదుకునేలా మానవత్వాన్ని చూపించాడు. సాయం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన అక్షయ్ కుమార్..  'నేను చేసిన సాయం చాలా చిన్నది. దీన్ని ప్రస్తావించడం కూడా నాకు ఇష్టంలేదు. లక్ష్మి గౌరవంగా జాబ్ సంపాదించాలనీ.. ఈలోగా ఇంటి అద్దెతో పాటు తన బిడ్డను పోషించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులూ పడకూడదనే ఉద్దేశంతో ఆమెకు నా వంతు సాయం అందించాను' అని అక్షయ్ కుమార్ చెప్పాడు. 

English Title
akshay kumar gave 5laks rupies to lakshmi agahrwal

MORE FROM AUTHOR

RELATED ARTICLES