టీఆర్ఎస్ ఓడితే కేసీఆర్ బీజేపీతో దోస్తీ: అక్బరుద్దీన్ ఓవైసీ

Submitted by chandram on Tue, 12/04/2018 - 14:06
Akbaruddin


ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే బీజేపీ పక్షాన చేరుతుందంటూ ఆయన వ్యాఖ్యానించారు.  టీఆర్ఎస్ అన్ని విధాల సహకరించడం వల్లే ఎన్నికల్లో మద్దతిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. టీఆర్ఎస్‌, ఎంఐఎంలకు కాకుండా ఎవరికి ఓటు వేసినా బీజేపీకి వేసినట్టేనని ఆయన అన్నారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ సోమవారం రాత్రి పాతబస్తీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో  ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఐదు నుండి పదేళ్లపాటు పాలిస్తోందన్నారు. టీఆర్ఎస్  పార్టీ తమ మాట వినకపోతే పరిస్థితులకు అనుగుణంగా తమ రాజకీయ వ్యూహాన్ని మార్చుకొంటామని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు.

English Title
Akbaruddin owaisi sensational comments on TRS party

MORE FROM AUTHOR

RELATED ARTICLES