ఆర్జీవీలోని నీచుడిని బయోపిక్‌లో చూపిస్తానంటున్న డైరెక్టర్

Submitted by arun on Tue, 07/31/2018 - 17:56
rgv

ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ శిష్యుడిగా అజయ్ భూపతి దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆయన రూపొందించిన RX 100 చిత్రం ఘన విజయం సాధించింది. భారీస్ఠాయిలో రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టింది. బూతు సినిమా అని ప్రచారం జరిగినా అలాంటి వాదనను ఎదురించి ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకొన్నది. ఆర్జీవీ శిష్యుడినని సగర్వంగా చెప్పుకునే అజయ్.. తాను బయోపిక్ తీస్తే కచ్చితంగా ఆయనదే తీస్తానంటున్నాడు. ఆయన అంతరంగాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమని.. అయినా ఎప్పటికైనా సినిమా తీస్తానని తెలిపాడు. ఆయనలో గొప్ప టెక్నీషియన్ ఉన్నాడని.. దేశంలోనే ఆయనను మించినవాడు లేడన్నాడు. అలాగే ఆయనంత నీచుడు కూడా ఉండడని అన్నాడు. దీనిపై వివరణ ఇస్తూ.. వర్మ అవతలి వ్యక్తుల జీవితాల్లోకి వెళ్లడం, కామెంట్ చేయడం తనకు నచ్చదన్నాడు అజయ్. దీనికి గాను వర్మను ఓ రోజు కిడ్నాప్ చేసి.. కాళ్లు చేతులు కట్టేసి.. రెప్పవాల్చకుండా చేసి.. మంచి ఫ్యామిలీ డ్రామాలను వరుస పెట్టి చూపించాలని అన్నాడు. అదే ఆయనకు తాను వేసే శిక్ష అని తెలిపాడు. ఆయనలోని టెక్నీషియన్‌ని, నీచుడిని రెండింటినీ బయోపిక్‌లో చూపిస్తానని చెప్పాడు అజయ్. ఓ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను తెలిపాడు.
 

English Title
Ajay Bhupathi Controversy comments on RGV

MORE FROM AUTHOR

RELATED ARTICLES