రన్‌వేపై దిగబోయి.. సముద్రంలో కూలిన విమానం

Submitted by arun on Fri, 09/28/2018 - 11:03
Micronesia lagoon

ప్రయాణికులతో వెళ్తోన్న విమానం అకస్మాత్తుగా సముద్రంలో ల్యాండైన  ఘటన పసిఫిక్ సముద్రంలోని మైక్రోనేషియన్ దీవుల్లో జరిగింది. ఎయిర్ నుగినికి చెందిన విమానం.. వీనో ఎయిర్‌పోర్ట్‌లో దిగాల్సి ఉండగా 'సడెన్‌గా  రన్‌వేకు 150 మీటర్ల దూరంలో ఉన్న  సరస్సులో  సముద్రంలో కూలింది.  ప్రమాద సమయంలో విమానంలో 36 మంది ప్రయాణికులతో పాటు 11 మంది సిబ్బంది ఉన్నారు. విమానం నీటిలో దిగగానే.. స్థానికలు బోట్లు వేసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని విమానంలో చిక్కుకున్న వారిని రక్షించారు. ఆ తర్వాత విమానం మెల్లమెల్లగా ఆ సముద్ర నీటిలో ముగినిపోయింది. అందరూ  ప్రాణాలతో క్షేమంగా బయటపడటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనసై విచారణకు అధికారులు ఆదేశించారు. 
 

English Title
Air Niugini plane crashes into ocean during take-off in Micronesia

MORE FROM AUTHOR

RELATED ARTICLES