నవ్వుల పాలైన అన్నాడీఎంకే దీక్షలు

నవ్వుల పాలైన అన్నాడీఎంకే దీక్షలు
x
Highlights

కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. అధికార పార్టీ అన్నాడీఎంకే రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఒక్కరోజు దీక్ష నవ్వుల పాలైంది....

కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. అధికార పార్టీ అన్నాడీఎంకే రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఒక్కరోజు దీక్ష నవ్వుల పాలైంది. జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో సాక్ష్యాత్తూ సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం దీక్షలో కూర్చొన్నారు. అయితే వెల్లోర్, పుదుకొట్టాయ్, కోయంబత్తూర్, సాలెం సహా చాలాప్రాంతాల్లో అన్నాడీఎంకే కార్యకర్తలకు బిర్యానీ, మద్యంను పంపిణీ చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. పార్లమెంట్ లో అన్నాడీఎంకే ఎంపీలు నిత్యం నిరసన తెలుపుతున్నారు. ఇటు రాష్ట్రంలో కూడా దీనిపైనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సీఎంబీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. అధికార అన్నాడీఎంకే ఇచ్చిన దీక్షలకు ఆ పార్టీ కార్యకర్తలంతా దీక్షలకు దిగారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగిన ఈ దీక్షల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా.. పార్టీ జిల్లా, గ్రామ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే దీక్షల్లో మద్యం, బిర్యానీ పంపకాలు జరగడంతో.. తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కావేరీ బోర్డుపై అధికార అన్నాడీఎంకే చిత్తశుద్ది ఏపాటిదో తేలిపోయిందని.. ఇదీ వీరి గొప్ప నిజాయితీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories