త్రివిక్ర‌మ్ పై ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం

Submitted by arun on Fri, 01/12/2018 - 12:55
pt

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఇండస్ట్రీ కొడుతుందునుకున్నారు. సినిమాను ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఊహించుకున్నారు. కానీ డైరెక్టర్ త్రివిక్రమ్ మాత్రం అందరి అంచనాలను తలక్రిందులు చేశాడు. సినిమాను ఆకాశానికెత్తేస్తాడనుకుంటే..పాతానికి పడేశాడు. దీంతో ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. అసలు అజ్ఞాతవాసి ఇలా కావడానికి త్రివిక్రమ్ చేసిన తప్పేంటి.

స్టార్ హీరో ఉన్నాడు కదా అని సినిమా ఎలా తీసినా ఆడుద్దనుకోవడం పెద్ద ముర్ఖత్వమే అవుతుంది. అజ్ఞాతవాసి మూవీతో దర్శకుడు త్రివిక్రమ్ అలాంటి పెద్ద తప్పిదమే చేశాడు. పవన్ కళ్యాణ్ ఉన్నాడన్న ధైర్యమో లేక ప్రేక్షకులకు ఏం తెలియదు మనం చూపిచ్చిందే చూస్తారనుకున్నాడో ఏమో కానీ అజ్ఞాతవాసి మూవీని బాధ్యాతారహిత్యంగా తీశాడనే అనుమానం వ్యక్తం అవుతోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మానియాను ద్రుష్టిలో పెట్టుకుని కోట్లలో బిజినెస్ జరుగుతుంది. నిర్మాత కోట్లలో డబ్బు ఖర్చు సినిమాను నిర్మిస్తాడు. ఇటు ప్రేక్షకులు పవన్ పై ఉన్న అభిమానంతో డబ్బులు ఖర్చు థియేటర్లకు క్యూ కడతారు. భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. మరి పవన్ నమ్ముకుని ఇంతలా బిజినెస్ జరిగేటప్పుడు డైరెక్టర్ ఇంతకెంత జాగ్రత్తగా ఉండాలి. సినిమాను ఎంత బాధ్యతగా తీర్చిదిద్దాలి. కానీ త్రివిక్రమ్ అవేవి పట్టించుకోన్నట్టు తెలుస్తోంది. పెద్దగా ఫోకస్ పెట్టి సినిమాను తీసినట్టు లేదు. స్టోరీలో కొత్తదనం లేకపోవడం..మేకింగ్ బాగాలేకపోవడం అన్ని సినిమా కొంపమంచాయి.

అజ్ఞాతవాసి మూవీ చూసిన ప్రేక్షకులకు త్రివిక్రమ్ ఏమాత్రం కొత్తదనం చూపించలేకపోయాడు. పాత సినిమాలను మిక్స్ చేసి తీసినట్టు అనిపిస్తుంది. స్టోరీనే కాదు త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. కనీసం కామెడీని కూడా పెద్దగా పండించలేకపోయాడు. ఫ్రెంచ్ మూవీ ఛాయల్ని తీసుకున్నా..స్టోరీని బలంగా తీర్చిదిద్దలేదు. మొత్తానికి అత్తారింటికి దారేది మూవీతో పవన్..ఆకాశానికెత్తేసిన త్రివిక్రమ్..అజ్ఞాతవాసి మూవీతో పాతాళానికి పడేశాడు.

అజ్ఞాతవాసి మూవీని చూసిన ఫ్యాన్స్ డైరెక్టర్ త్రివిక్రమ్ పై ఆగ్రహాంగా ఉన్నారు. ఫ్యాన్స్ తలెత్తుకోలేకుండా చేశాడని ఫైర్ అవుతున్నారు. సినిమాను ఏ మాత్రం సీరియస్ గా తీసుకోకుండా చేశాడని తిట్టుకుంటున్నారు. పవన్ సినిమాను త్రివిక్రమ్ ఇంత దారుణంగా తీస్తాడని కలలో కూడా ఎక్స్ పెక్ట్ చేయలేదు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

English Title
Agnyaathavaasi War Between Pawan Kalyan Fans

MORE FROM AUTHOR

RELATED ARTICLES