అజ్ఞాతవాసి టీమ్ లో టెన్షన్.. టీంకు నోటీసులు పంపిన టీ సీరీస్ ?

అజ్ఞాతవాసి టీమ్ లో టెన్షన్.. టీంకు నోటీసులు పంపిన టీ సీరీస్ ?
x
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అగ్నాతవాసికి, కాపీ వివాదం తలెత్తింది. 2008 లో వచ్చిన ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ కి ఇది కాపీ అంటూ , రిలీజ్ కిముందే...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అగ్నాతవాసికి, కాపీ వివాదం తలెత్తింది. 2008 లో వచ్చిన ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ కి ఇది కాపీ అంటూ , రిలీజ్ కిముందే విమర్శలు తలెత్తాయి. లార్గో వించ్ కథ, అగ్నాత వాసి కథకి పోలికలుండటం , ఇది కాపీ అంటూ వార్తలు రావటంతో,అసలు వివాదం మొదలైంది. 2008 లో లార్గో వించ్ మూవీ ఫ్రెంచ్ లో రిలీజైతే, 2011 లో దీ హైర్ అప్పరెంట్ గా యూఎస్ లో రిలీజ్ అయ్యింది. దానికి సీక్వెల్ కూడా వచ్చింది ఐతే, ఇదే కథ , అగ్నాతవాసిగా త్రివిక్రమ్ తీశాడనే వివాదం నడుస్తోంది.

లార్గో వించ్ కథ విషయానికొస్తే, కోటీశ్వరుడైన ఓ మల్టీ మీలీనియర్ ని చంపి తన ఆస్తి కొట్టేయాలని ప్రత్యర్థులనుకుంటారు కాని, తన రహస్య దత్త పుత్రుడు, సీన్లోకొచ్చి, తన తండ్రిని చంపిని వాల్లని చంపుతు, రివేంజ్ తీసుకుంటాడు కంపినీని, ఆస్తిని ప్రత్యర్ధుల నుంచి కాపాడుతాడు ఐతే, అగ్నాత వాసి కథ కూడా ఇదేనంటూ రకరకాల పుకార్లు పెరగటం, త్రివిక్రమ్ కాని అసలు సినిమా టీం మెంబర్స్ కాని స్పందించకపోవటంతో, గుసగుసలే నిజమనే పరిస్థితొచ్చింది.

లార్గో వించ్ మూవీ రీమేక్ రైట్స్ ని బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ టీ సీరీస్ సంస్థ ఎప్పుడో కొనేసింది. ఈలోపే అగ్నాతవాసి కథ ఇదంటూ నెట్ లో ప్రచారం పెరిగింది...ఐతే, త్రివిక్రమ్ కాని, ప్రొడ్యూసర్ కాని రూమర్స్ కి రియాక్ట్ కాకపోవటంతో, టీ సీరీస్ సంస్థ, అగ్నాతవాసి టీంకి నోటీసులు పంపిందనే ప్రచారం పెరిగింది.

రిలీజ్ కి ముందే అగ్నాతవాసిని చూపించి, తమ ఆమోదం తీసుకోవలని, టీసీరీస్ సంస్థ, అగ్నాత వాసి టీంకు నోటీసు పంపిందంటున్నారు. ఐతే టీ సీరీస్ అధిపతితో రానాకి మంచి సంబంధాలు ఉండటంతో, వివాద పరిష్కారానికి ఈ హీరోని సీన్లోకి దింపినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ కథని కాపీ కొట్టే అగ్నాతవాసి మూవీతీస్తున్నారనే వార్తలు గుప్పుమనటంతో, అసలు సినిమాదర్శకుడు కూడా రియాక్ట్ అయ్యాడు. లార్గో వించ్ మూవీ తీసిన డైరెక్టర్ జోరెమ్ సల్లే కూడా ట్వీట్ చేశాడు. అగ్నాతవాసి మూవీ చూసేందుకు టిక్కెట్లు కూడా బుక్ చేసుకుంటానంటూ ట్వీట్ చేశాడు. ఇంత జరిగినా అగ్నాతవాసి టీం రియాక్ట్ కాలేదు.

మెగా హీరో అల్లు శిరీష్ మూవీ, ఒక్క క్షణం కూడా కాపీ కథే అంటూ, రిలీజ్ కిముందు వివాదమైంది. కొరియన్ మూవీ ప్యారలల్ లైఫ్ కథే ఎత్తేశారని కామెంట్లొచ్చాయి. కథని కాస్త అటు ఇటు మార్చి తీశారనే విమర్శలొచ్చాయి. నిజానిక కొరియన్ మూవీ ప్యారలల్ లైఫ్ రీమేక్ రైట్స్ ని అనిల్ సుంకర అఫీషియల్ గా కొని, 2 మేమిద్దరం మూవీ తీశారు....అందుకే ఒక్క క్షణం టీం మీద ఫైర్ అయ్యాడని వార్తలొచ్చాయి చివరికి ఒక్కక్షణం టీంతో మ్యాటర్ సెటిల్ చేసుకున్నారనే ప్రచారాలు కూడా జరిగాయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories