'అజ్ఞాతవాసి' తొలివారం వసూళ్లు!

Submitted by arun on Wed, 01/17/2018 - 17:41
agnathavasi

ప‌వ‌న్ క‌ల్యాణ్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో అజ్ఞాతవాసి ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. తొలి ఆటతోనే ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ, వసూళ్ల ప్రభావం మాత్రం బాగానే కొనసాగిందని చెప్పాలి. పవన్ సినిమా ఎలా వున్నా ఒకసారి చూడాలంటూ అభిమానులు థియేటర్స్ కి రావడమే అందుకు కారణం. తొలివారంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 39.15 కోట్ల షేర్ ను .. 59.7కోట్ల గ్రాస్ ను సాధించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే .. 54.95 కోట్ల షేర్ ను .. 88.7 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అదనపు షోలు .. టికెట్ రేటు ఎక్కువగా ఉండటం వలన ఈ స్థాయి గ్రాస్ వసూళ్లు సాధించడం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.    
 

English Title
agnathavasi first week collections

MORE FROM AUTHOR

RELATED ARTICLES