చిక్కుల్లో పడ్డ అజ్ఞాతవాసి మూవీ..కాపీ అయితే టీంకు భారీ జరిమానా తప్పనట్టే

చిక్కుల్లో పడ్డ అజ్ఞాతవాసి మూవీ..కాపీ అయితే టీంకు భారీ జరిమానా తప్పనట్టే
x
Highlights

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా చిక్కుల్లో పడింది. భారీ అంచనాలతో రిలీజ్ కు ముస్తాబవుతున్న వేళ వివాదంలో చిక్కుకుంది. సినిమాకు కాపీ రైట్ దుమారం...

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా చిక్కుల్లో పడింది. భారీ అంచనాలతో రిలీజ్ కు ముస్తాబవుతున్న వేళ వివాదంలో చిక్కుకుంది. సినిమాకు కాపీ రైట్ దుమారం చుట్టుముట్టుంది. ఓ ప్రెంచ్ సినిమాను కాపీ కొట్టారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ అజ్ఞాతవాసి మూవీకి కొత్త ఇబ్బందులు ఎదురైయ్యాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి మూవీ ఇంకో వారంలో రోజుల్లో రిలీజ్ కాబోతోంది. సినిమాపై ఫ్యాన్స్, ఆడియన్స్ భారీ అంచనాలతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇంతలోనే అజ్ఞాతవాసి సినిమా వివాదంలో ఇరుక్కుంది. సెన్సార్ ను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాపై కాపీ రైట్ దుమారం చలరేగుతోంది.

త్రివిక్రమ్ దర్శకత్వం అందించిన అజ్ఞాతవాసి సినిమా..ఫ్రెంచ్‌ యాక్షన్‌ థ్రిల్లర్ 'లార్గో వించ్‌'అనే మూవీకి కాపీ అనే ప్రచారం జరుగుతోంది. ప్రెంచ్ మూవీ కాపీ రైట్స్ ను దక్కించుకున్న బాలీవుడ్ నిర్మాత సంస్థ టీ సిరీస్ అజ్ఞాతవాసి టీంకు నోటీసులు పంపించిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అజ్ఞాతవాసి మూవీ రిలీజ్ గందరగోళంలో పడినట్టైంది. అజ్ఞాతవాసి మూవీపై కాపీ రైట్ అంశం తెరపైకి రావడంతో ఆ ప్రెంచ్ మూవీ దర్శకుడు జెరోమ్ సల్లే రంగంలోకి దిగనున్నాడట. ఇండియాకు పయనమైయ్యేందుకు టికెట్ కూడా బుక్ చేసుకున్నాడట. అజ్ఞాతవాసి సినిమాను చూశాకా..తన సినిమాకు కాపీనా కాదా అని తేల్చనున్నాడనే వార్తలు వస్తున్నాయి.

అజ్ఞాతవాసి కాపీ రైట్ అంశం వార్తలపై దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత చిన్నబాబు ఇంతకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఐతే ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు అజ్ఞాతవాసి టీం నుంచి రానాను రంగంలోకి దింపారనే వార్తలు వచ్చాయి. రానాకు టీ సిరీస్ యజమానికి క్లోజ్ కావడంతో అతడి ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారనే రూమర్స్ కూడా వినిపించాయి.

అజ్ఞాతవాసి మూవీ నిజంగానే ప్రెంచ్ మూవీకి కాపీ ఐతే మాత్రం యూనిట్ భారీ మొత్తంలో నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు అంశం కోర్టు పరిధిలోకి వెళుతుంది కనుక రిలీజ్ పై గందరగోళం తలెత్తే అవకాశం లేకపోలేదు. భారీ అంచనాలు క్రియేట్ చేసిన అజ్ఞాతవాసి ఇప్పటికే వీరలెవెల్లో ప్రీ బిజినెస్ చేసింది. దాదాపు 150కోట్ల వరకు ప్రీ బిజినెస్ జరిపినట్టు తెలుస్తోంది. మరి ఇలాంటి సమయంలో సినిమాపై కాపీ రైట్ వివాదం చుట్టుముట్టడం టీం యూనిట్ తో పాటు ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. మరి ఈ వివాదం నుంచి అజ్ఞాతవాసి ఎలా భయటపడుతుందనే సర్వత్రా ఉత్కంఠకు గురిచేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories