ఈ ఆదిత్య 369 సినిమా, కాలం తో ప్రయాణం

Submitted by arun on Sat, 10/27/2018 - 15:20
Aditya369

కాలం... అనే విషయం  మీద ఎన్నో పరిశోదనలు జరుగుతున్నాయి.. అలాగే ఎన్నో సినిమాలు వచ్చాయి.. అందులో బాగంగానే వచ్చిన ఒక సినిమా ఆదిత్య 369..  ఈ ఆదిత్య 369 సినిమా 1991లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాకి  బాక్ టు ఫ్యూచర్ అనే ఆంగ్ల చిత్రం, ఇంకా హెచ్.జి.వెల్స్ టైం మెషీన్ నుండి స్ఫూర్తి పొంది తీసిన చిత్రం. సైన్స్‌ఫిక్షన్‌ను, చరిత్రను, ప్రేమను, క్రైమ్‌ను జోడించి తీసిన ఈ సినిమా బాలకృష్ణ నటించిన సినిమాలలో ఒక ముఖ్యమైన గుర్తింపును పొందింది. తెలుగు సినిమా ప్రేక్షకులకు అంతగా అలవాటు లేని ఈ విధమైన క్లిష్టతతో కూడుకొన్న కథను తెరకెక్కించి ప్రేక్షకుల ఆదరణ పొందడంలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రతిభ కనిపిస్తుంది. జంధ్యాల మాటలు, వేటూరి పాటలు, ఇళయరాజా సంగీతం, శ్రీరామ్, స్వామిల ఫొటోగ్రఫీ ఈ చిత్ర విజయానికి బాగా దోహదం చేశాయి. విజయనగర రాజ్యంకాలంలో కృష్ణమోహన్ అనే (తరువాతి కాలంనుండి వచ్చిన) యువకునిగానూ, కృష్ణదేవరాయలుగానూ కూడా బాలకృష్ణ నటించాడు. ఈ సినిమా పిల్లలకి, పెద్దలకి... అందరికి నచ్చుతుంది.. ఇప్పటి వరకు మీరు చూడకుంటే మాత్రం.. తప్పక ప్రతి తెలుగు వాడు.. చూడాల్సిన సినిమా. శ్రీ.కో.

English Title
aditya 369 movie

MORE FROM AUTHOR

RELATED ARTICLES