లీడర్ల మైండ్‌ బ్లాంకయ్యే డిసిషన్‌... ఎక్కడ.. ఏంటది?

లీడర్ల మైండ్‌ బ్లాంకయ్యే డిసిషన్‌... ఎక్కడ.. ఏంటది?
x
Highlights

మాట తప్పం. మడమ తిప్పం. ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే. రాజకీయ నాయకుల నోటిలోంచి, ఈ డైలాగ్‌ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో....

మాట తప్పం. మడమ తిప్పం. ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే. రాజకీయ నాయకుల నోటిలోంచి, ఈ డైలాగ్‌ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో. అదెంటో గానీ ఐదేళ్ల వరకు, వారు గజినీలా మారిపోయి, అంతా మర్చిపోతారు. అసలు అలాంటి హామీ ఇచ్చామా....వాగ్ధానం చేశామా అన్నట్టుగా అమాయక ఫేసు పెడతారు. కానీ ప్రతిసారి మర్చిపోవడానికి జనం, నాయకుల్లా గజినీలు కాదు...అందుకే రాజకీయ నాయకుల మైండ్‌ బ్లాంకయ్యే నిర్ణయం తీసుకున్నారు.

ఆదిలాబాద్ జిల్లా బీమ్‌పూర్ మండలం గుబిడి గ్రామం. ద్వీపంలాంటి గ్రామం.... ఇక్కడ సుమారు రెండు వేలకు పైగా జనాభా నివసిస్తున్నారు. గ్రామం పక్కన వాగు ప్రవహిస్తోంది. దీనికి వంతెన లేదు. ఇది సంవత్సరంలో వేసవి కాలంలో తప్ప, అన్ని కాలాల్లో ఉధృతంగా ప్రవహిస్తుంది. దాంతో వర్షాకాలం వచ్చిందంటే చాలు, గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. అత్యవసర సమయంలో, ఆస్పత్రికి వెళ్లాలంటే ఇబ్బంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, రోగులను మంచాన వేసుకుని వాగు దాటుతుంటారు. కొన్నిసార్లు ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. ముఖ్యంగా పురిటినొప్పుల టైంలో, గర్భిణీలకు ప్రాణాలతో చెలగాటమే.

వంతెన లేకపోవడంతో వాగు రాకాసిగా మారి ప్రాణాలు మింగుతోందని, దీనిపై వంతెన నిర్మించాలని, గబిడి ప్రజలు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ, అన్ని పార్టీలూ బ్రిడ్జి నిర్మిస్తామని హామీలిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకూ నిర్మించలేదు. దీంతో రాజకీయ పార్టీలపై ఆగ్రహంతో రగిలిపోతున్న ప్రజలు, పార్టీల నమ్మకద్రోహానికి నిరసనగా, ఏకంగా ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. మాట తప్పిన నేతలకు ఓటు వేసేదిలేదని తెగేసి చెబుతున్నారు. ఓటే వజ్రాయుధమని, ఆ ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయాలని రాజకీయ నాయకులు మైకులు విరిగేలా ప్రసంగాలు బాగానే చేస్తారు. కానీ ఆచరణలో అదే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తారు. అందుకే ప్రజాతంత్రంపైనే ప్రజలకు నమ్మకం పోయిందనడానికి, ఎన్నికలను బహిష్కరిస్తున్న గ్రామాలే నిదర్శనం. మరి మాట తప్పం, మడమ తిప్పమని డైలాగులు దంచే నాయకులు, ఈసారైనా గుబిడి గ్రామానికి వాగ్దానం చేస్తారా....వంతెన నిర్మిస్తారా....ప్రాణాలు నిలబెడతారా? ఓటు వేసేందుకు ప్రేరణ కలిగిస్తారా...? హామీలకు బాధ్యులై ఉంటారా?

Show Full Article
Print Article
Next Story
More Stories