అదుగో సినిమా రివ్యూ

Submitted by arun on Fri, 11/09/2018 - 11:25
adhugu

అదుగో సినిమా రవిబాబు స్టైల్ సినిమా...ఇంతకు ముందు భయపెట్టే సినిమాలు తీస్తే... ఇప్పుడు తను ఎంచుకున్న పంథా కామెడి. ఈ విధానంలో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.  రక రకాల కథలను ఓ పందిపిల్ల చుట్టూ అల్లుతూ ..తయారు చేసుకున్నాడు..  ఈ “అదుగో” కథ. ఈ సినిమా కోసం..లైవ్‌ 3డీ యానిమేషన్‌లో పందిపిల్ల క్యారెక్టర్‌ తాయారు చేసారు. బడ్జెట్‌ లిమిటెడ్ గా వున్నా క్వాలిటీ గ్రాఫిక్స్‌ ఇచ్చి అలరించాడనే చెప్పాలి. ప్రశాంత్‌ విహారి అందించిన సంగీతం సినిమాకి కొంత బలాన్ని పెంచిన్దనే చెప్పాలి.  ప్రధానంగా కామెడీతో కసరత్తు చేస్తూ తీసిన సినిమా .. ఇది. కొన్ని సన్నివేశాలు బాగానే వున్నా...ఈ సినిమా మీద వున్నా అంచనాలు...లేదా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆశించిన స్థాయికి ఈ సినిమా పూర్తిగా అందుకోలేదనే చెప్పాలి.. అయిన కూడా అందమైన పంది పిల్లని చూడటానికి, అలాగే రవి బాబు నటన కోసం.. మీకు సమయం వుంటే  ఒక సారి చూడవచ్చు. శ్రీ.కో.

English Title
adhugo movie review

MORE FROM AUTHOR

RELATED ARTICLES