హీరోయిన్ ఆదాశర్మ పడుతున్న కష్టం చూస్తే..

హీరోయిన్ ఆదాశర్మ పడుతున్న కష్టం చూస్తే..
x
Highlights

'ఆదాశర్మ' హీరోయిన్ గుర్తు ఉండే ఉంటుంది. తెలుగమ్మాయి అయినా..బాలీవుడ్ లో స్థిరపడింది. లవర్ బాయ్ నితిన్ సరసన హార్ట్ ఎటాక్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం...

'ఆదాశర్మ' హీరోయిన్ గుర్తు ఉండే ఉంటుంది. తెలుగమ్మాయి అయినా..బాలీవుడ్ లో స్థిరపడింది. లవర్ బాయ్ నితిన్ సరసన హార్ట్ ఎటాక్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఆశించినంత విజయం సాధించలేదు. ఆ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కన సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో చేసినా అమ్మడికి అదృష్టం కలిసిరాలేదు. ఆఖరికి అడవి శేష్ హీరోగా వచ్చిన క్షణం సినిమాతో హిట్ అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ కు దూరమైన ఈ బ్యూటీ బాలీవుడ్ లో మంచి ఆఫర్లే సాధిస్తోంది. ఇటీవల ఓ హాలీవుడ్ చిత్రంలో కూడా ఆదా నటించడానికి ఒప్పుకుందట. అందులో ఆదా పాత్ర కూరగాయలు అమ్మే సాధారణ మహిళ పాత్ర అట. ఇక దీనికోసం ఆదాశర్మ తో ఓ ఫోటో షూట్ కూడా చేయించారు. ఆదాశర్మ రోడ్డు పక్కన బాగా మాసి, చినిగిన చీరకట్టుకొని నిద్రలేమితో, అలసిపోయినట్టుగా కూరగాయలమ్ముతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరు ఆదా శర్మ ఇలా మారిపోయిందేంటి.. ఎందుకింతలా కష్టపడుతుందని అని అనుకోవడం కొసమెరుపు.

Show Full Article
Print Article
Next Story
More Stories