నాలుగేళ్ల క్రితం ప్రేమలో పడి...బ్రేకప్ అయ్యాం : తాప్సీ

Submitted by arun on Wed, 02/14/2018 - 11:10
actress taapsee

తాప్సి ని చూస్తే కుర్ర కారు గుండెల్లో చిచ్చు రేగాల్సిందే.  ఈ అమ్మడు చాలా తెలుగు సినిమా ల్లో నటించింది అయితే ఏ సినిమా కూడా తనకు బ్రేక్ ఇవ్వలేక పోయింది. ఒక్క హిట్ పడిన తెలుగు లో తన అదృష్టం మారిపోయుండేది. వాలెంటైన్స్ డే సందర్భంగా హీరోయిన్ తాప్సీ పలు విషయాలను వెల్లడించింది. రెండో తరగతిలో ఉన్నప్పుడే ఈ అమ్మడు మనసు పారేసుకుందట. అబ్బాయి చాలా క్యూట్ గా ఉండేవాడని... అయితే దాన్ని ప్రేమ అని చెప్పలేనని తెలిపింది. హైస్కూల్ కు వెళ్లిన తర్వాత అబ్బాయిలు తనను చూడాలనే కోరికతో... చక్కగా రెడీ అయి వెళ్లేదాన్నని చెప్పింది. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అబ్బాయిలు ఎవరైనా తనను చూసి, ఫస్ట్ సైట్ లోనే ప్రపోజ్ చేస్తారేమోనని ఆలోచించేదాన్నని తెలిపింది. స్కూల్ కారిడార్ లో నిల్చుని కబుర్లు చెప్పుకోవడం, ప్రేమలేఖలు తీసుకోవడం... ఇవన్నీ ఇప్పుడు ఆలోచిస్తే స్టుపిడ్ గా అనిపిస్తుందని చెప్పింది.

నాలుగేళ్ల క్రితం ఓ అబ్బాయితో ప్రేమలో పడ్డానని తాప్సి తెలిపింది. అయితే ఆ తర్వాత తామిద్దరం బ్రేకప్ అయ్యాయని... అది కూడా తన మంచికే  అనుకుంటానని చెప్పింది. లవ్ బ్రేకప్ కావడం కూడా ఒక్కోసారి మనకు ఎంతో ఉపకరిస్తుందని... ఈ నాలుగేళ్లలో కెరీర్ పరంగా తాను ఎంతో ఎదిగానని తెలిపింది. ఇప్పుడు తాను ప్రేమలో ఉన్నానా? లేదా? అనే విషయం గురించి అడిగితే చెప్పడం కష్టమని... వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పాలనుకోవడం లేదని చెప్పింది.

English Title
actress tapsi says about love

MORE FROM AUTHOR

RELATED ARTICLES