శ్రీదేవిని చంపింది ఆమె కుటుంబీకులే!

Submitted by arun on Mon, 03/19/2018 - 10:54
mulugu

ఇండియన్ సెల్యులాయిడ్ ఐకాన్ శ్రీదేవి ‘మరణం’ మళ్ళీ వార్తల్లోకెక్కింది. మిస్టరీ ఏమీ లేదని, ఆమెది సహజ మరణమేనని దుబాయ్ దర్యాప్తు అధికారులు తేల్చిచెప్పడంతో ఆ ‘కథ’ అక్కడితో ముగిసిపోయిందనుకున్నారు. కానీ.. ఆ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోవద్దంటూ ఇప్పుడో కొత్త వాదన బైటికొచ్చింది. ఇది కూడా సాక్షాత్తూ ఉగాది పర్వదినాన.. ఉగాది పంచాంగ శ్రవణంలో వినిపించడం గమనార్హం.

శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం ఆస్థాన పండితుడు ములుగు రామలింగేశ్వరస్వామి ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం చేశారు. ప్రముఖ నటి శ్రీదేవిది హత్యేనని, ఆమెను సొంత కుటుంబీకులే చంపారని ఆదివారం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో ఆయన పేర్కొన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఒక్క లోక్‌సభ సీటు కూడా రాదని పేర్కొన్నారు.  ఉగాది సందర్భంగా ఆయన పంచాంగ శ్రవణం చేస్తూ.. అనేక అంశాల మీద వివరణ ఇచ్చారు. గడచిన సంవత్సరంలో జరిగిన ఘటనల్ని కూడా స్పర్శిస్తూ.. నటి శ్రీదేవి మరణాన్ని ప్రస్తావించారు. శ్రీదేవి జీవిత చరమాంకం గురించి అనేక విషయాల్ని దాచిపెట్టారన్నది ఆయన చెబుతున్న మాట.

English Title
actress sridevi was killed

MORE FROM AUTHOR

RELATED ARTICLES