ఫ్యాన్స్‌కి షాకిచ్చిన శ్రీరెడ్డి

ఫ్యాన్స్‌కి షాకిచ్చిన శ్రీరెడ్డి
x
Highlights

తన అభిమానులకు షాకిచ్చింది నటి శ్రీరెడ్డి. తెలుగు బిగ్‌బాస్ రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే...

తన అభిమానులకు షాకిచ్చింది నటి శ్రీరెడ్డి. తెలుగు బిగ్‌బాస్ రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే బిగ్‌బాస్-2లో శ్రీరెడ్డి కూడా కంటిస్టెంట్‌గా ఎంపికైనట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. నాని వ్యాఖ్యాతగా జూన్ పదో తేదీ నుంచి ఈ షో ప్రారంభం కానుంది. 16మంది సెలబ్రిటీలు 100 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉంటారు. ఈ నేపథ్యంలో క్యాస్టింగ్ కౌచ్‌పై గళం విప్పి.. ఇటీవలి కాలంలో సంచలన ప్రకటనలు చేస్తూ వార్తల్లో నిలిచిన సినీ నటి శ్రీరెడ్డి కూడా ఈ షోలో పాల్గొననున్నట్టుగా వార్తలొచ్చాయి.

కానీ బిగ్ బాస్-2లో తాను పాల్గొనలేదని శ్రీరెడ్డి స్పష్టం చేసింది. ఇది తన దురదృష్టం, తన స్నేహితులకు చేదువార్తని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తన స్నేహితులు అప్సెట్ అయినా.. కొంతమందికి సంతోషాన్నిస్తుందని శ్రీరెడ్డి చెప్పింది. పోటీదారులు అదృష్టవంతులు, బిగ్ బాస్ 2 బృందానికి ఆల్ ది బెస్ట్ అంటూ శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories