మరో బాంబ్ పేల్చిన శ్రీరెడ్డి...ఏకంగా వాట్సాప్ ఛాట్‌ను పోస్ట్ చేసింది

మరో బాంబ్ పేల్చిన శ్రీరెడ్డి...ఏకంగా వాట్సాప్ ఛాట్‌ను పోస్ట్ చేసింది
x
Highlights

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరతీసింది. కాస్టింగ్ కౌచ్ పేరుతో తనను వేధించి, అవకాశాలు ఇవ్వకుండా చేసిన ఇండస్ట్రీ పెద్దల బండారం ఒక్కొక్కటిగా...

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరతీసింది. కాస్టింగ్ కౌచ్ పేరుతో తనను వేధించి, అవకాశాలు ఇవ్వకుండా చేసిన ఇండస్ట్రీ పెద్దల బండారం ఒక్కొక్కటిగా బయటపెడుతూ ఇండస్ట్రీ పెద్దల్లో దడ పెట్టిస్తోంది శ్రీరెడ్డి. గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో శ్రీరెడ్డి లీక్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ ప్రముఖ గాయకుడు తనతో జరిపిన వాట్సాప్ ఛాట్ ఇదేనంటూ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఆ గాయకుడిని ఇండియన్ ఐడల్ శ్రీరామ్‌గా పేర్కొంది. శ్రీరామ్‌తో దిగిన పిక్స్ కూడా ఛాట్‌లో ఉన్నాయి. ‘‘మన ఇండియన్ ఐడల్ ఛాట్‌ను ఒకసారి చూడండి. నువ్వు సిగ్గు పడాలి శ్రీరామ్. నీ పేరయిన శ్రీరామ్‌ని తొలగించెయ్. నీకు ఆ పేరును కలిగి ఉండే అర్హత లేదు’’ అంటూ ఆమెతో జరిపిన ఛాట్ ఇదేనంటూ వాట్సాప్ ఛాట్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories