జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అతి తక్కువ కాలంలోనే సూపర్ పాపులర్ అయిన కమెడియన్ హైపర్ ఆది. తన షోలలో ఆది వేసే పంచ్‌లు, సెటైర్లు ఓ రేంజిలో పేలుతుంటాయి....
జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అతి తక్కువ కాలంలోనే సూపర్ పాపులర్ అయిన కమెడియన్ హైపర్ ఆది. తన షోలలో ఆది వేసే పంచ్‌లు, సెటైర్లు ఓ రేంజిలో పేలుతుంటాయి. ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ఎక్కువగా పంచ్‌లు విసురుతుంటాడు. ఈ క్రమంలోనే ఆది ఇటీవల తన షోలో టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ సంచలనం శ్రీరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కొన్ని పంచ్‌లు విసిరారు. దీనిపై శ్రీరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆది మీద ఎదురు దాడికి దిగారు. ఘాటైన పదజాలంతో ఆమె ఆదిపై విరుచుకుపపడ్డారు. ఓ క్రమంలో తన కోపాన్ని ఆపుకోలేక నిన్ను బ్రతికనిచ్చేదాన్ని కాదు అంటూ వ్యాఖ్యానించారు. ఆది వేసిన సెటైర్లపై ఫేస్బుక్ లైవ్‌లో ఆమె స్పందించారు. ముందుగా ఆదిపై ప్రశంసలు గుప్పించినట్లే గుప్పించిన ఆమె.. తర్వాత తీవ్ర వ్యాఖ్యలకు దిగారు. తరిమి తరిమి కొడతానంటూ, తాట తీస్తానంటూ హెచ్చరించారు.
సహించబోను... ‘ఆది గారూ.. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. మీరు మంచి రచయిత. మీ పొట్టకూటిని చూసుకుంటూనే మరికొందరికి లైఫ్ కూడా ఇస్తున్నారు. ఆ విషయంలో నేను అభినందిస్తున్నా. కానీ, మీ పద్ధతి బాగోలేదు. గతంలో మీరు చేస్తున్న అదే షోలో కొన్ని కులాల గురించి, కొందరి గురించి కించపరిచేలా మాట్లాడారంటూ కొందరిని వెంటపడి మరీ కొట్టిన ఘటనలు మీకు గుర్తుండే ఉంటాయనుకుంటా. అలాగని ఎవరో వచ్చే దాకా ఎదురు చూసే రకాన్ని నేను కాదు. వెంటపడి తరిమి తరిమి కొడతా. హైపర్ ఆది నీ తాట తీస్తా. మహిళలపై సమాజంలో ఇప్పుడిప్పుడే కాస్త గౌరవం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో నువ్వు కించపరిచే కామెంట్లు చేస్తే ఊరుకోను’ అని ఆమె హెచ్చరించారు.
ఘాటు వ్యాఖ్యలు... తాను చేసిన నిరసన దీక్షను ఆది తక్కువ చేసి మాట్లాడాడని, ‘షర్ట్ విప్పరా.. ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేస్తుంది’ ఓ డైలాగ్ చెప్పాడని ఆమె తెలిపారు . ‘నేను తెలిపింది నిరసన.. అది సెక్సీ నెస్ కాదు. ఆది.. నీ పుట్టుకకు అవమానం తీసుకురాకు... అంటూ ఘాటు పదజాలమే వాడారామే. తల్లిగా, చెల్లిగా, భార్యగా మగాడి జీవితంలో పాత్రలు పోషించే మహిళలపై టీవీషో అడ్డుపెట్టుకుని జోకులేయొద్దని, అలా కాదు అని ఇదే కొనసాగితే వంద చెప్పులు నీ మీద వచ్చి పడతాయి’ అని ఆదిని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. గతంలో ఓ ప్రముఖ హీరో గురించి మాట్లాడిన కత్తి మహేష్ పైకూడా ఆది ఇదే షోలో సెటైర్లు వేసిన విషయాన్ని ఆమె ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఇక ఆది పేల్చే పిచ్చి జోకుల వెనుక ఆ షో న్యాయనిర్ణేత నాగబాబు ప్రమేయం గనుక ఉంటే మాత్రం.. రాజకీయంగా ప్రభావం చూపుతుందని ఆమె హెచ్చరించారు. మహిళలను కించపరిచే డైలాగులపై ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ షో నిర్వాహకులను కూడా ఆమె నిలదీశారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire