శ్రీరెడ్డి... ఈసారి టార్గెట్ కేసీఆర్, బాబు!

Submitted by arun on Tue, 04/10/2018 - 16:23
Sri Reddy

హైదరాబాద్ ఫిల్మ్‌ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసి సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి, ఈసారి తెలుగు రాష్ట్రాల సీఎంలను టార్గెట్ చేసింది. మంగళవారం ఉదయం తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘ప్రపంచమంతా నా నిరసన గురించి చర్చించుకుంటోంది. కానీ మన మంత్రులు, ఇద్దరు సీఎంలు మాత్రం దీని గురించి మాట్లాడక పోవడం చాలా విచారకరం’ అంటూ వ్యాఖ్యానించింది.  తనకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్యత్వం ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తంచేసింది శ్రీరెడ్డి. ఐతే, ఆమెకి సభ్యత్వం ఇచ్చే ప్రసక్తే లేదని ఇప్పటికే ‘మా’ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

English Title
actress sri reddy fb post against ap and telangana cms

MORE FROM AUTHOR

RELATED ARTICLES