ప్రియుడు పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడని నటి ఫిర్యాదు

Submitted by nanireddy on Mon, 09/17/2018 - 10:15
actress-nilani-complaint-her-boy-friend-tamil-nadu

పెళ్లి చేసుకోమని నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడనిి నీలాణి తన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్టెర్‌లైట్‌ పోరాట దృశ్యాలను పోలీసుల దుస్తుల్లో వెళ్లి చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేసి వార్తల్లోకెక్కి సంచలనం సృష్టించింది. అప్పట్లో ఆమెపై సీరియస్ అయిన పోలీసులు నీలాణిపై కేసు నమోదు చేశారు. ఆ  తరువాత బెయిల్ పొంది బయటికి వచ్చిన నీలాణి తమిళ బుల్లితెర సీరియల్స్ లో నటిస్తోంది. అయితే అంతకుముందునుంచే ఆమెకు లలిత్‌కుమార్‌ అనే యువకుడికి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. కొంతకాలంగావీరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో నీలాణి ఆదివారం స్థానిక మైలాపూర్‌లో జరుగుతున్న ఒక టీవీ.సీరీయల్‌ షూటింగ్‌లో పాల్గొంది.

షూటింగ్ స్పాట్ కి లలిత్‌కుమార్‌ వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని గొడవకు దిగాడు. దీంతో టీవీ సీరియల్‌ షూటింగ్‌లో కలకలం చెలరేగింది. అతని చేష్టలకు విస్తుపోయిన నటి నీలాణి స్థానిక మైలాపూర్‌ పోలీస్ స్టేషన్ లో లలిత్‌కుమార్‌పై ఫిర్యాదు చేసింది.ఫిర్యాదులో బలవంతంగా పెళ్లి చేసుకోమని వేధిస్తున్నటు పేర్కొంది. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 

English Title
actress-nilani-complaint-her-boy-friend-tamil-nadu

MORE FROM AUTHOR

RELATED ARTICLES