ప్రభుదేవాతో పెళ్లి విషయమై స్పందించిన పవన్ హీరోయిన్

Submitted by nanireddy on Sun, 05/13/2018 - 17:32
actress-nikesha-patel-issues-clarification-marriage-rumours-plans-with-prabhu-deva

గత కొద్ది రోజులుగా కొమరంపులి హీరోయిన్ నికిషా పటేల్,ప్రఖ్యాత డాన్సర్ ప్రభుదేవా ప్రేమలో పడినట్టు త్వరలో వారు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అందుకు బలమైన సాక్షం లేకపోలేదు నికిషా పటేల్ ఓ ఆంగ్ల న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం.. ఆ ఇంటర్వ్యూలో ప్రభుదేవాతో కలిసి పనిచేయాలనుకుంటున్నారా? అని విలేకరి అడిగితే..‘సినిమా ఏంటి? ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఉంది’ అని నికీషా అన్నారట. ఇక ఆమె వ్యాఖ్యలపై నెటిజెన్లు పలు విధాలుగా స్పందించారు.. వారికీ అడ్వాన్స్ గా వెడ్డింగ్ శుభాకాంక్షలు అంటూ సరదాగా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. ఇక పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన నికిషా ప్రభుదేవాతో పెళ్లి రూమర్లపై స్పందించారు.. ఆమె పిఆర్ఓ ద్వారా వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. 'ప్రభుదేవా సర్‌ గురించి నేను అన్న మాటలపై చాలా వార్తా పత్రికలు ఏవేవో రాసేస్తున్నాయి. వీటిపై క్లారిటీ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను ప్రభుదేవానే కాదు ఎవ్వరినీ పెళ్లి చేసుకోవడం లేదు' అంటూ క్లారిటీ ఇచ్చేసారు దీంతో ఈ రూమర్లకు తెరపడినట్టేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి. 

English Title
actress-nikesha-patel-issues-clarification-marriage-rumours-plans-with-prabhu-deva

MORE FROM AUTHOR

RELATED ARTICLES