శ్రీరెడ్డిపై మరో బాంబు పేల్చిన కల్యాణి

Submitted by arun on Sat, 04/21/2018 - 10:52
sk

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు చినికి చినికి గాలివానగా మారిన సంగతి తెలిసిందే. పవన్ ను శ్రీరెడ్డి తిట్టించిన వ్యవహారంలో వర్మ పాత్ర ఉందని ఆయనే స్వయంగా ఒప్పుకోవడం వర్మపై చర్యలలు తీసుకోవాలంటూ ఏకంగా పవన్ ఫిల్మ్ చాంబర్ కు రావడం వంటి పరిణామాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తాజాగా శ్రీరెడ్డి వ్యక్తిగత జీవితానికి సంబంధించి నటి కరాటే కల్యాణి బహిర్గతం చేసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. ఇటీవల ఓ టీవీ చానెల్‌ చర్చలో శ్రీరెడ్డి వాదనతో విబేధించిన కల్యాణి.. లైవ్‌లోనే చేయిచేసుకోవడం విదితమే.

శ్రీరెడ్డికి కూతురు, కోట్ల ఆస్తులు: ‘కల్యాణి లీక్స్ మొదలయ్యాయి. పెళ్లి కాని విమలకు(శ్రీరెడ్డి అసలు పేరును చెబుతూ) ఇంటర్‌ పూర్తిచేసిన కూతురుంది. గడిచిన 10 ఏళ్ల నుంచి తల్లిదండ్రులతో సంబంధాలు లేవని శ్రీరెడ్డి చెప్పింది. కానీ కొంతకాలం కిందట కూకట్‌పల్లిలో కోట్ల విలువైన ఫ్లాట్‌లోకి గృహప్రవేశం చేసినప్పుడు ఆమె వెంట తల్లికూడా ఉన్నారు. ఇదికాకుండా తను ఖరీదైన కార్లలో తిరుగుతుంది. ఇవన్నీ కొనడానికి డబ్బులు ఎలా వచ్చాయో ఆమెకే తెలియాలి. మరికొన్ని లీక్స్‌ నాకు నచ్చినప్పుడు బయటపెడతా.. నా లీక్స్ నా ఇష్టం’’ అని నటి కరాటే కల్యాణి అలియాస్‌ కల్యాణి పడాల వెల్లడించారు.

English Title
Actress Karate Kalyani Kalyani Leaks

MORE FROM AUTHOR

RELATED ARTICLES