బన్నీ పబ్ లో కలిస్తే..అదే అడిగేవారు : అపూర్వ

Submitted by arun on Thu, 06/14/2018 - 11:52
Apoorva

తాను సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో పబ్ కల్చర్ చాలా బాగా అనిపిచ్చేదని, నిత్యం పబ్‌లకు వెళ్లేవాళ్లమని నటి అపూర్వ చెప్పారు. తాము రెగ్యులర్‌గా వెళ్లే టచ్ పబ్‌కు బన్నీ కూడా వచ్చేవారని వెల్లడించారు. ఓ వెబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అపూర్వ ఈ విషయాలు చెప్పుకొచ్చారు. తాము రెగ్యులర్‌గా వెళ్లే టచ్ పబ్‌కు బన్నీ కూడా వచ్చేవారని వెల్లడించారు. మేం వెళ్లే టచ్ బప్ కి బన్నీ కూడా వచ్చేవారని..నేనెప్పుడైనా ఎదురుపడితే ఏంటండీ పబ్‌లో కనిపించట్లేదు అంటూ బన్నీ సరదాగా అనేవారు. అంత ఫన్నీగా ఉండేవాళ్లం. ఒక ఏజ్‌లో ఆ రకమైన కల్చర్ ఉంటుంది  అని అపూర్వ వెల్లడించారు. ప్రస్తుతం తాను బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నానని పబ్‌లకు వెళ్లడం కరెక్ట్ కాదని, ఆ ప్రభావం సామాన్యులపై పడుతుందని అపూర్వ తెలిపారు.  పబ్‌కు వెళ్లడం తప్పు అని తెలిసినప్పుడు మానేయాలి. పబ్‌కు వెళ్తే తప్పా అంటే?.. నేను వెళ్తే తప్పు. ఒక నార్మల్ అబ్బాయి పబ్‌కు వెళ్తే ఫర్వాలేదు.

అదే ఒక హీరోయిన్, హీరో వెళ్తే సమాజంలో వాళ్లను చూసి తొందరగా నేర్చుకునేది ఎక్కవగా ఉంటుంది. మా ఇంపాక్ట్ సొసైటీ మీద పడొద్దని, మంచివాటికి పడితే మంచిదని నా ఉద్దేశం. అందుకే నేను మానేశాను  అంటూ తన పబ్ కల్చర్ గురించి వివరించారు.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి కూడా అపూర్వ ప్రస్తావించారు. సెట్‌లో ఖాళీగా ఉన్నప్పుడు ఆయన ఏనాడూ అమ్మాయిలతో మాట్లాడటం తాను చూడలేదని అపూర్వ చెప్పారు. ఆడవాళ్లందరినీ ‘అమ్మా’ అని సంబోధిస్తారని, మంచి అబ్బాయని కొనియాడారు.
 

English Title
actress apoorva talk about allu arjun

MORE FROM AUTHOR

RELATED ARTICLES