దోశ పెనంతో దర్శకుడి మొహం పగలగొట్టిన నటి అంజలి.. ఎందుకో తెలుసా..!

Submitted by arun on Sat, 08/04/2018 - 13:05
anjali

జర్నీ సినిమాలో తన నటనతో మెప్పించారు అంజలి. ఆ తర్వాత ’సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు‘ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంజలి సినిమాలో దెయ్యంగా అందరిని భయ పెట్టారు. ఈ క్రమంలో కుటుంబ కలహాలు, హీరో ’జై‘ తో బ్రేక్ అప్.. వార్తలతో ఆమె సినీ జీవితానికి కొంచెం అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం కోలుకుని వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్నారు అంజలి. అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించి మరో వార్త...టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. షూటింగ్ సందర్భంగా దోశ పెనుంతో దర్శకుడి మొహం పగలగొట్టిందట అంజలి.. అసలు అంజలికి అంత కోపం ఎందుకు వచ్చింది.. ఆ దర్శకుడు ఏం చేశారు అంటే...

  ప్రస్తుతం తన కొత్త సినిమా ‘లీసా’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు అంజలి. ఇందులో యాక్షన్‌ సీన్స్ చేసే సమయంలో అంజలి తన చేతిలోని దోశ పెనంను కెమెరా ముందు విసిరేయాలి. ఈ క్రమంలో దర్శకుడు చెప్పినట్లే అంజలి దోశ పెనుంను విసిరేశారు. కానీ, అది పొరపాటున వెళ్లి కెమెరా పక్కనే ఉన్న దర్శకుడి మొహానికి బలంగా తగిలింది. దీంతో ఆయన కనుబొమ్మల మధ్య చిట్లి తీవ్రగాయం అయింది. అది చూసి షూటింగ్‌లో ఉన్న వాళ్లు ఆయనను హాడివుడిగా... ఆస్పత్రికి తరలించారు. కుట్లు కూడా పడ్డాయి. అయితే తన వల్ల దర్శకుడు గాయపడటంతో అంజలి తెగ బాధపడిపోయారట. అయితే షూటింగ్ లో ఇలాంటివి మామూలే అంటూ కొందరు ఆమెను సముదాయించారట.
 

Tags
English Title
actress anjali beat director

MORE FROM AUTHOR

RELATED ARTICLES