వచ్చిన సంపాదనంతా అమ్మాయిలకే ఖర్చు చేసేవాడు: వనిత

Submitted by admin on Wed, 12/13/2017 - 11:09

తన భర్త విజయ్‌సాయికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో తనకు తెలియదని ఆయన భార్య వనిత తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘విజయ్‌కి వేరే మహిళతో సంబంధం ఉంది. ఆ విషయం నేను కళ్లారా చూశాను. అప్పటి నుంచే మా మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని ఆయన తల్లిదండ్రులు దృష్టికి తీసుకెళ్తే వారు కూడా పట్టించుకోలేదు. సంపాదనంతా అమ్మాయిలకే ఖర్చు చేసేవాడు.

అమ్మాయిలతో పరిచయాలు వద్దని చాలాసార్లు చెప్పాను. ఇలాంటి వద్దని మనిద్దరం సంతోషంగా ఉందామని చెప్పిచూసినా అతడు వినలేదు. విజయ్‌ ప్రవర్తన గురించి అత్తమామలకు చెప్పినా పట్టించుకోలేదు. రెండేళ్లుగా కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. సూసైడ్‌ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకు తెలియదు. పాప విషయంలో కూడా నేను ఎలాంటి జోక్యం చేసుకోలేదు. అప్పుడప్పుడు వచ్చి పాపను తీసుకెళ్లి మళ్లీ తీసుకొస్తుండేవారు. అయితే పెళ్లి సమయంలో నేను ఏదైతే ఇచ్చానో దాన్ని తిరిగి ఇవ్వమని కోరాను. ఎందుకంటే పాప భవిష్యత్‌ను కూడా నేను చూసుకోవాలి కదా’’ అని చెప్పుకొచ్చారు.

English Title
actor-vijay-wife-vanitha-allegations

MORE FROM AUTHOR

RELATED ARTICLES