వైఎస్‌ జగన్‌ను పరామర్శించిన మోహన్‌బాబు

Submitted by arun on Fri, 11/02/2018 - 15:17

విశాఖ విమానాశ్రయంలో కత్తిపోటుకు గురైన వైసీపీ అధినేత జగన్ హైదరాబాదులోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ కోలుకుంటున్నారని.. వందేళ్లు బతుకుతారని ఆకాంక్షించారు. కాంగ్రెస్, టీడీపీ పరస్పరం సహకరించుకోవడంపై మీ స్పందన ఏంటని మీడియా ప్రతినిధిగా అడగ్గా.. దయచేసి తనను వదిలేయాలని, సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలపై మాట్లాడతానని మోహన్‌బాబు చెప్పారు.

English Title
Actor Mohan Babu Visits YS Jagan Home

MORE FROM AUTHOR

RELATED ARTICLES