వర్కింగ్‌ ప్రెసిడెంట్‌‌గా కేటీఆర్‌‌ యాక్షన్ ప్లాన్ ఏంటి?

x
Highlights

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పార్టీపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన మర్నాడే పార్టీ బలోపేతం కోసం యాక్షన్...

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పార్టీపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన మర్నాడే పార్టీ బలోపేతం కోసం యాక్షన్ మొదలుపెట్టారు. ఇంతకీ కేటీఆర్‌‌ యాక్షన్ ప్లాన్ ఏంటి? కేటీఆర్‌ టీమ్‌లో ఎవరెవరు ఉండబోతున్నారు? పంచాయతీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కేటీఆర్ చేస్తోన్న వ్యూహరచన ఏంటి? టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్‌‌ అప్పుడే యాక్షన్‌ మొదలుపెట్టారు. పార్టీ బలోపేతం దిశగా చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టిన కేటీఆర్‌‌ కార్యవర్గ సమావేశం నిర్వహించి ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. ముందుగా పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కేటీఆర్‌‌ అన్ని గ్రామాల్లో గులాబీ జెండా ఎగిరేలా వ్యూహరచన చేస్తున్నారు. తన ప్లాన్‌‌ను పక్కాగా ఎగ్జిక్యూట్ చేసేందుకు టీమ్‌ ఏర్పాటుకు కసరత్తు మొదలుపెట్టారు. అయితే చిన్న బాస్‌ టీమ్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతోపాటు యువ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
.
గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి యాక్షన్ ప్లాన్‌ మొదలుపెట్టిన కేటీఆర్‌ ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో రెండు వేలమంది ముఖ్యకార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని పార్టీ నేతలకు ఆదేశాలిచ్చారు. లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక ప్రధాన కార్యదర్శికి బాధ్యతలు అప్పగించారు. పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయి పర్యటనలకు కూడా శ్రీకారం చుట్టారు కేటీఆర్‌‌. ముందుగా తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల నుంచే పర్యటన చేపట్టనున్నారు. రేపు సిరిసిల్లలో, ఎల్లుండి వరంగల్‌లో పర్యటించనున్న కేటీఆర్‌‌ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. వేగంగా పార్టీ కార్యాలయాల నిర్మాణంతోపాటు పంచాయతీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడేలా పనిచేయాలంటూ కేడర్‌‌కు దిశానిర్దేశం చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories