పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రంభ

Submitted by nanireddy on Wed, 09/26/2018 - 09:57

నటి రంభ మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్నీ రంభ కుటుంబసభ్యులు దృవీకరించారు. అంతేకాకుండా ఆమె భర్త ఇంద్రకుమార్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపారు. ‘మాకు మగబిడ్డ జన్మించాడు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు. కాగా 2010లో రంభ, ఇంద్రకుమార్‌ల వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఇద్దరు 
టొరంటోలో స్థిరపడ్డారు. అయితే రెండేళ్ల కిందట దంపతులమధ్య  విబేధాలు వచ్చి విడాకుల వరకు వెళ్లారు. తిరిగి ఆ తర్వాత ఈ దంపతులు మళ్లీ ఒక్కటయ్యారు. రంభ టాలీవుడ్ లో ఒకప్పుడు లక్కీ హీరోయిన్.. ఆమె నటించిన  ‘ఆ ఒక్కటీ అడక్కు’, 'బావగారు బాగున్నారా' , , ‘బొంబాయి ప్రియుడు’, ‘గణేష్’ తదితర చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం రంభ అడపాదడపా చిత్రాల్లో నటిస్తోంది.

English Title
acter ramba delever boy

MORE FROM AUTHOR

RELATED ARTICLES