మహిళా ఎమ్మెల్యే సంచలన ట్వీట్!

Submitted by arun on Sat, 12/30/2017 - 13:58
ma

ముస్లింల నిరసనలు, అడ్డంకులు, నిరసనల మధ్య ఎట్టకేలకు ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్ సభ ఆమోదం పొందింది. ఈ బిల్లు పట్ల ఎన్డీయేతర పార్టీల నేతల నుంచి ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆప్ మహిళా ఎమ్మెల్యే ఆల్కా లంబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ, ట్విట్టర్ ద్వారా పరోక్ష విమర్శలు గుప్పించారు.
 
‘‘ఎందుకు అనవసరంగా త్రిపుల్ తలాక్ చెప్పి జైలుకు వెళ్తారు.. ఆమెకు ఏమీ చెప్పకుండా వదిలేస్తే భారత దేశానికి ప్రధాన మంత్రి కావచ్చు’’ అని మోదీ వైవాహిక జీవితాన్ని ఉద్దేశిస్తూ ఆల్కా లంబా చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. పలువురు నెటిజన్లు ఆమె ట్వీట్‌కు మద్దతిస్తుండగా.. కొంతమంది విమర్శిస్తున్నారు. మోదీ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకోకుండా మాట్లాడడం కరెక్ట్ కాదని కామెంట్ చేస్తున్నారు. ‘కాంగ్రెస్ నుంచి ఆప్‌లో చేరిన మీకు మోదీ గొప్పతనం గురించి ఏం తెలుసు?’ అని బీజేపీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు.
 

English Title
AAP MLA Alka Lamba tweet on tripletalaq

MORE FROM AUTHOR

RELATED ARTICLES