ఫోన్లు చేసి గెస్ట్‌ హౌస్‌కు రమ్మనేవారు: ఆమని

Submitted by arun on Tue, 07/03/2018 - 12:44
amani

తన కెరీర్‌లో కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఎదుర్కొన్నాను అని చెప్పింది నటి ఆమని. ఒక దశలో హీరోయిన్‌గా వెలిగిన ఆమని ప్రస్తుతం కేరెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తల్లి, అత్త పాత్రల్లో బిజీగా ఉంది ఆమని. వివాహం చేసుకున్న తర్వాత నటనకు కొంత దూరం అయిన ఆమె ఇప్పుడు తిరిగి బిజీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో సినీ రంగంలో తన అనుభవాల గురించి వివరించింది ఈ నటి. ‘చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో నేనూ క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నాను. కొత్త నిర్మాతల నుంచి నాకు ఫోన్లు వచ్చేవి. ఒంటరిగా గెస్ట్‌ హౌస్‌కు రమ్మనేవారు. తోడుగా అమ్మను తీసుకురావద్దు అని చెప్పేవారు. వారి ఉద్దేశం నాకు అర్థమైంది. దాంతో అలాంటి ఫోన్లు పట్టించుకోవడం మానేశా. కానీ పేరున్న దర్శకులు, నిర్మాతల నుంచి ఎప్పుడూ ఎలాంటి వేధింపులు ఎదుర్కోలేదు.’ అని తెలిపారు.

English Title
Aamani opens up about casting couch

MORE FROM AUTHOR

RELATED ARTICLES