మా ప్రాంతంలో మాదే రాజ్యం... గోండుల గోడిదే!!

మా ప్రాంతంలో మాదే రాజ్యం... గోండుల గోడిదే!!
x
Highlights

ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసీలు-లంబాడాల గొడవ, మరో మలుపు తిరిగింది. ఎస్టీ రిజర్వ్‌ స్థానాల్లోని రెండింటిలో, లంబాడా అభ్యర్థులనే ప్రకటించడంపై ఆదివాసీలు...

ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసీలు-లంబాడాల గొడవ, మరో మలుపు తిరిగింది. ఎస్టీ రిజర్వ్‌ స్థానాల్లోని రెండింటిలో, లంబాడా అభ్యర్థులనే ప్రకటించడంపై ఆదివాసీలు రగిలిపోతున్నారు. ఆదివాసీల రాజ్యంలో, లంబాడాలను నిలబెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. మా రాజ్యం మా ఓట్లు మా సీట్లు మావేనంటూ, ఎన్నికల శంఖారావం పూరించారు. ఇంద్రవెల్లిలో ఆదివాసీల ఐక్యత సదస్సు నిర్వహించి, నినాదాలు హోరెత్తించారు. ఈ సభకు భారీ ఎత్తున ఆదివాసీలు హాజరయ్యారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎస్టీలకు మూడు సీట్లు రిజర్వ్‌ అయ్యాయి. వాటిలో అసిపాబాద్, ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాలున్నాయి. అసిఫాబాద్ మినహా రెండు నియోజకవర్గాలలో లంబాడా అభ్యర్థులకు టికెట్లను కేటాయించింది టిఆర్‌ఎస్. ఆదివాసీల ఓట్లు అధికంగా ఉన్న, నియోజకవర్గాలలో లంబాడాలకు టికెట్లు కేటాయించడంపై తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతోంది.

మా ప్రాంతంలో మారాజ్యం...మాఓట్లు మాకే అంటూ ఆదివాసీలు నినదిస్తున్నారు. లంబాడా టీఆర్ఎస్‌ అభ్యర్థి రేఖానాయక్‌కు వ్యతిరేకంగా ప్రచారం మొదలెట్టారు. ఆయన తమ గూడాలకు రావద్దని ప్లెక్సీలతో ప్రచారం చేపట్టారు. అదేవిదంగా ఖానాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి బరిలో నిలపాలని తీర్మానం చేశారు ఆదివాసీలు. ఈ మూడు నియోజకవర్గాలలో లంబాడా ఓట్ల కంటే ఆదివాసీల ఓట్లు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ, అధికంగా ఓట్లు ఉన్నా తమను కాదని, పార్టీలు లంబాడా అభ్యర్థులకు టికెట్ కేటాయించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఉద్యమం చేస్తుంటే, టిఆర్‌ఎస్ ఆదివాసీలను కించపరిచేలా లంబాడాలకే రెండుచోట్ల టికెట్లు కేటాయించడంపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు స్థానాలలో లంబాడా అభ్యర్థులను ఓడిస్తామని ప్రతిజ్న చేశారు. దీంతో టిఆర్‌ఎస్ కి పెద్ద తలనొప్పిగా మారింది లంబాడా వర్సెస్‌ ఆదివాసీ గొడవ.

ఎన్నికలలో అత్యంత ప్రభావం చూపే వర్గం, తమకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుండటంతో టిఆర్‌ఎస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. టిఆర్ఎస్ వెంటనే లంబాడా అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే అభ్యర్థులను ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఖానాపూర్‌లో స్వతంత్ర అభ్యర్థిని దించుతామని ప్రకటించారు. అదేవిధంగా బోథ్‌లో సోయం బాపురావు ఎన్నికల బరిలో దిగకపోతే, అక్కడ ఆదివాసీల అభ్యర్థిని రంగంలోకి దించడానికి సమాలోచన చేస్తున్నారు. ఆదివాసీల ఓట్ల ఉద్యమం అటు కాంగ్రెస్‌ గుండెల్లోనూ టెన్షన్‌ పుట్టిస్తోంది. అభ్యర్థులపై గట్టి కసరత్తు చేస్తోంది. ఆదివాసీల ఉద్యమ ప్రభావం, అటు నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాలలోనూ ఉంటుందని ప్రధానపార్టీలు మథనపడుతున్నాయి. ఒకవేళ పార్టీలు సీట్లు కేటాయించకపోతే తుడుం దెబ్బ తరుపున పోటి చేయడానికి ఆదివాసీ సంఘాల నేతలు సిద్దమవుతున్నారు. మొత్తానికి, ఆదివాసీ ఉద్యమ పరిణామాలపై ప్రధాన పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. వాళ్ల ఉద్యమాన్ని శాంతించడానికి వ్యూహలను రచిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories