90 శాతం మంది రాజ్యసభ ఎంపీలు కోటీశ్వరులే..!

Submitted by arun on Sun, 03/25/2018 - 12:31
Rajya Sabha

అమ్మో...! 90 శాతం మంది రాజ్యసభ ఎంపీలు కోటేశ్వరులే. 229 మంది సిట్టింగ్ రాజ్యసభ ఎంపీల్లో ఒక్కో ఎంపీ సరాసరి ఆస్తి 55 కోట్లు ఉంది. అందులో 4078.41 కోట్లతో అగ్రస్థానంలో జేడీయూ ఎంపీ మహేంద్ర ప్రసాద్, 1001.64 కోట్లతో రెండో స్థానంలో జయా బచ్చన్, 857.11 కోట్లతో మూడో స్థానంలో రవీంద్ర కిశోర్ ఉన్నారు. 

రాజకీయ నాయకుల ఆస్తులు అమాంతం పెరిగిపోతున్నాయనడానికి అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ తాజాగా నివేదిక ఓ నిదర్శనం.  229 మంది సిట్టింగ్ ఎంపీల్లో 201 మంది కోటీశ్వరులేనని, ఒక్కో రాజ్యసభ సభ్యుని సరాసరి ఆస్తి 55.62 కోట్లని నివేదిక తెలిపింది. మొత్తం 233 మంది సిట్టింగ్ రాజ్యసభ ఎంపీల్లో 229 మంది స్వయంగా దాఖలు చేసిన అఫిడవిట్‌ల ఆధారంగా ఈ డేటాను రూపొందించినట్లు ఏడీఆర్ వెల్లడించింది. 

ఎంపీల జాబితాలో జనతాదళ్-యునైటెడ్‌కు చెందిన మహేంద్ర ప్రసాద్ అత్యధికంగా  4078.41 కోట్ల ఆస్తిని కలిగి ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, నటి జయాబచ్చన్ 1001.64 కోట్లతో రెండో స్థానంలోనూ, బీజేపీకి చెందిన రవీంద్ర కిశోర్ సిన్హా  857.11 కోట్లతో మూడోస్థానంలోనూ ఉన్నారు. పార్టీల వారీగా చూస్తే, 64 మంది బీజేపీ ఎంపీల్లో ఒక్కో ఎంపీ సరాసరి ఆస్తి విలువ 27.80 కోట్లుగా ఉంది. 

50 మంది కాంగ్రెస్ ఎంపీల విషయానికొస్తే ఒక్కో ఎంపీ సరాసరి ఆస్తి 40.98 కోట్లు. 14 మంది ఎంపీలున్న సమాజ్‌వాదీ పార్టీలో ఒక్కో ఎంపీ సరాసరి ఆస్తి విలువ 92.68 కోట్లు. కాగా, 229 మంది రాజ్యసభ ఎంపీల్లో 51 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. సుమారు 20 మందిపై తీవ్రమైన క్రిమినవల్ కేసులున్నాయి. మరోవైపు 154 మంది ఎంపీలు పలు రుణ వితరణ సంస్థలకు బాకీపడి ఉన్నారు. వారిలో సంజయ్ దత్తాత్రేయ కఖడే అత్యధికంగా 304.60 కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. 

English Title
90% Rajya Sabha MPs are crorepatis: ADR report

MORE FROM AUTHOR

RELATED ARTICLES