తెలంగాణ వ్యాప్తంగా 67 శాతం పోలింగ్: ఈసీ

Submitted by chandram on Fri, 12/07/2018 - 21:05
Rajat Kumar

తెలంగాణలో ఎక్కడా రీ పోలింగ్‌‌కు అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ తెలిపారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని స్పష్టం చేశారు. 2014 కంటే ఈ సారి పోలింగ్ పర్సెంటేజీ పెరిగిందన్న రజత్‌ కుమార్ కొన్నిచోట్ల పోలింగ్‌ ఆలస్యం కావడానికి మానవ తప్పిదాలే కారణం అని తేల్చిచెప్పారు. తెలంగాణ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 67 శాతం పోలింగ్‌ నమోదైందని ఆయన తెలిపారు. ఉదయం కొన్ని చోట్ల పోలింగ్‌ ఆలస్యంగా మొదలైందని అయితే మాక్ పోలింగ్ ఆలస్యం కావడం వల్లే జరిగిందని వివరించారు. ఎక్కడా సాంకేతికంగా సమస్యలు ఎదురుకాలేదన్నారు. ఎన్నికల రోజున మొత్తం 4 వేల 292 ఫిర్యాదులు అందాయని అందులో 3 వేల 660 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. 

కొన్నిచోట్ల ఓట్ల గల్లంతు కొంతమేర వాస్తవమే అని రజత్‌కుమార్‌ ఒప్పుకున్నారు. ఓట్ల గల్లంతుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయన్న ఆయన ఓటరు లిస్టులో పేరు లేని వారు క్షమించాలని విజ్ఞప్తి చేశారు. మరోసారి పొరపాటు జరగకుండా చూసుకుంటామన్నారు. బోగస్ ఓట్లపై రాజకీయ పార్టీలు ఎక్కువగా ఫిర్యాదులు చేశాయని ఒకసారి మాక్‌ ఓటర్‌ జాబితా వస్తే దాన్ని మార్చలేమన్నారు. గుత్తా జ్వాల విషయంలో స్పందించిన రజత్‌కుమార్‌ ఆమె ప్రొసీజర్‌ ఫాలో కాలేదని తెలిపారు. సమస్యాత్మక 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగిసిందని అక్కడ 74 శాతం పోలింగ్‌ నమోదైందని రజత్‌ కుమార్‌ తెలిపారు. 119 నియోజకవర్గాల్లో కౌంటింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 

English Title
67% polling in Telangana: EC

MORE FROM AUTHOR

RELATED ARTICLES