5కోట్ల ఫేస్‌బుక్‌ అకౌంట్లు హ్యాక్.. వినియోగదారులు ఇలా చేసుకోవాలని హెచ్చరిక..

Submitted by nanireddy on Sat, 09/29/2018 - 07:41
5-crore-face-book-accounts-hacked

సామజిక మధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ మరో బాంబ్ పేల్చింది  దాదాపు 5కోట్ల ఫేస్‌బుక్‌ వినియోగదారుల అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయని వెల్లడించింది. ‘వ్యూ యాజ్‌’ అనే ఫీచర్‌ ని అకౌంట్లోకి పంపించి హ్యాకర్లు చొరబడి సమాచారాన్ని సేకరించినట్టు అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈ డేటాను సేకరించారో లేదో స్పష్టమైన ఆధారం దొరకడం లేదని ఫేస్‌బుక్‌ యంత్రాంగం తెలుపుతోంది. అయితే మిగిలిన కోట్లాదిమంది వినియోగదారుల భద్రతాకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే చేశామని తెలుపుతోంది. అయినా కూడా అక్రమార్కులు ఫేస్‌బుక్‌పై తరచూ సైబర్‌ దాడులకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌  అన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే శుక్రవారం ఉదయం 9 కోట్లకు పైగా వినియోగదారులను అత్యవసరంగా తమ అకౌంట్లను లాగ్‌ఔట్‌ చేయాలని  న్యూస్‌ఫీడ్‌ పైన ఫేస్‌బుక్‌ తెలియజేసింది. 

English Title
5-crore-face-book-accounts-hacked

MORE FROM AUTHOR

RELATED ARTICLES