లీటర్ పెట్రోల్‌పై రూ.4 తగ్గింపు.. టూవీలర్లకు మాత్రమే

Submitted by arun on Thu, 06/14/2018 - 17:06
petrol

ఇటీవలి కాలంలో పెట్రో ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) వినియోగదారులకు కాసింత ఊరట కల్పించాలని భావించింది. గురువారం ఎంఎన్‌ఎస్‌ అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే జన్మదినాన్ని పురస్కరించుకుని.. వాహనదారులకు 4 నుంచి 5 రూపాయల మేర తగ్గింపుపై పెట్రోలు అందించాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. అందులో భాగంగా  ఈ రోజు రాష్ట్రంలో ఎంపిక చేసిన పెట్రోలు బంక్‌ల్లో  ద్విచక్ర వాహనదారులకు ఈ సదుపాయం కల్పించింది. మరికొన్ని చోట్ల  9 రూపాయల వరకు కూడా తగ్గింపు ఇస్తున్నారు. దీంతో చాలా మంది వాహనదారులు ట్యాంక్‌ ఫుల్‌ చేయించుకుంటున్నారు. ఎంపిక చేసిన పెట్రోలు బంక్‌ల ముందు వందల మీటర్ల మేర వాహనదారులు బారులు తీరారు.
 

English Title
48 pumps in Maharashtra are giving petrol at Rs 4 less than market price today

MORE FROM AUTHOR

RELATED ARTICLES