ఇండియా టుడే సర్వే...సీఎంగా జగన్‌...

Submitted by arun on Sat, 09/15/2018 - 11:03

ఏపీలో ఫ్యాన్‌ స్పీడ్‌కు సైకిల్‌ వేగం తగ్గనుందా..? ఏపీ సీఎం పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలని అనుకుంటున్నారు..? తెలుగు రాష్ట్రాల ఓటరు నాడి ఎటువైపు..? సంచలన విషయాలను వెల్లడించిన ఇండియా టుడే సర్వే ఫలితాలు

తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ పై ఇండియా టుడే సర్వే ఫలితాలు అత్యంత ఆసక్తిగొలిపే విధంగా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏపీలో వైసీపీకి ఓటేస్తామని రాష్ట్రవ్యాప్తంగా 43 శాతం మంది వెల్లడించినట్లు సర్వే ఫలితాలు తెలిపాయి. అధికార తెలుగుదేశానికి 38 శాతం మంది, జనసేన పవన్‌కు 5 శాతం మంది జై కొట్టారు. 

అలాగే చంద్రబాబు సర్కారుపై 33 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా బాగోలేదంటూ 36 శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సీఎంగా జగన్‌ కావాలంటూ  40 నుంచి 41 శాతం కోరగా చంద్రబాబుకే తిరిగి అవకాశం కల్పించాలని.. 39 నుంచి 40 శాతం మంది అభిప్రాయాన్ని వెల్లడించారు. 

English Title
43 per cent people want Jagan Mohan Reddy as next Andhra CM

MORE FROM AUTHOR

RELATED ARTICLES