కర్నూలులో కాఫీ లేడీ.. ఇంట్రెస్టింగ్ స్టోరీ

కర్నూలులో కాఫీ లేడీ.. ఇంట్రెస్టింగ్ స్టోరీ
x
Highlights

కాస్త తలనొప్పిగా ఉంటే ఓ మంచి ఫిల్టర్ కాఫీ తాగితే పోతుందంటారు. మరి జీవితాంతం కేవలం కాఫీ మాత్రమే తాగుతుంటే? అది మాత్రమే తాగి జీవిస్తుంటే? అన్నం నీళ్లు...

కాస్త తలనొప్పిగా ఉంటే ఓ మంచి ఫిల్టర్ కాఫీ తాగితే పోతుందంటారు. మరి జీవితాంతం కేవలం కాఫీ మాత్రమే తాగుతుంటే? అది మాత్రమే తాగి జీవిస్తుంటే? అన్నం నీళ్లు ముట్టకుండా బతకడం సాధ్యమవుతుందా. అవును సాధ్యమవుతుందని నిరూపిస్తోంది ఓ మహిళ. 40 ఏళ్లుగా కాఫీ మాత్రమే తాగుతూ పరిపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తూ అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న కర్నూలు మహిళపై ప్రత్యేక కథనం.

ఈవిడే కాఫీ లేడీ విజయలక్ష్మి. కర్నూలులో నివసించే విజయలక్ష్మికి కాఫీ అంటే ప్రాణం. డైలీ డైట్ మెనూలో కాఫీ తప్ప మరేదీ ఉండదు. ఒకటి కాదు రెండు కాదు, గత నలభై ఏళ్ల నుంచి ఆమె ఎటువంటి ఘనపదార్దాలు తీసుకోకుండా కేవలం కాఫీనే తాగుతూ బతకు బండి లాగుతున్నారు. వయసు అరవై దాటినా ఇంట్లో, కాలేజీలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ బిజీబిజీగా గడుపుతూ పని ఒత్తిడికి గురైనా ఏమాత్రం నిరసించకుండా ఇరవై ఏళ్ల మహిళగా హుషారుగా ఉంటారీవిడ.

కాఫీ అంటే ఇంతలా తాపత్రయపడుతున్న ఈమె ఏ మద్రాసీ మహిళనో కాదు, అచ్చంగా రాయలసీమ ప్రాంత ఆడపడుచు. సీమలో 50 ఏళ్లపై బడి హెల్ధీగా ఉన్న ఎవరిని కదిలించినా రాగిసంగటి, జొన్నరొట్టె, కొర్రబువ్వ, ఎర్రకారం ఇవే తమ ఆరోగ్య రహస్యాలని గొప్పగా చెప్తారు. కానీ ఈవిడ మాత్రం తన హెల్త్ సీక్రెట్ అంతా కాఫీలోనే దాగి ఉందంటారు.

ఇంతకు ఈమె ఘన పదార్దాలు తినక పోవడానికి, కాఫీనే తాగడానికి గల కారణాలు తెలుసుకోవాలంటే నలబై ఏళ్లు వెనక్కు వెళ్లాల్సిందే. విజయలక్ష్మి స్వగ్రామం కోవెలకుంట్ల సమీపంలోని కలుగొట్ల. పామిరెడ్డి, లక్ష్మమ్మల కుమార్తె అయిన విజయలక్ష్మి ఐదోక్లాసు దాకా సొంతూర్లోనే చదువుకున్నారు. తర్వాత ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రేవనూరులోని హైస్కూల్‌కు వెళ్లేది. స్కూల్ బ్యాగ్‌తో పాటు భోజనం క్యారియర్ తీసుకెళ్లడం భారంగా అనిపించడంతో కాఫీ తాగడం అలవాటుగా మార్చుకున్నారు

బంధువల ఇంటికో ఇంకేదైనా ఫంక్షన్‌కో వెళ్లినా కేవలం కాఫీనే తాగుతుంది తప్ప ఎటువంటి ఆహార పదార్దాలు తీసుకోరు. ఒకవేళ బంధువులు ఫోర్స్ చేస్తే కొద్దిగా ఐస్ క్రీమ్ తింటారు. పెళ్లైన తొలినాళ్లలో కాఫీ అలవాటును మాన్పించేందుకు ఆమె భర్త సుబ్బారెడ్డి చాలా ట్రై చేశారట. కానీ అవేమీ ఫలించ లేదంటారు విజయలక్ష్మి. కాఫీ తాగడం వల్ల ఆనారోగ్య సమస్యలు ఏవైనా తలెత్తుతాయని సుబ్బారెడ్డి డాక్టర్లకు చూపించారు. ఆమె శరీరం కాఫీ తత్వానికి సరిపోయిందనీ, ఏమీ ఫర్వాలేదని డాక్టర్లు చెప్పడంతో కాస్త కుదుటపడ్డానని చెబుతారీయన. ఇంట్లో రుచికరమైన వంటకాలు చేసి పెడుతుంది కానీ తమతో కలసి భోజనం చేయకపోవడం అప్పుడప్పుడు బాధేస్తుందని సుబ్బారెడ్డి చెబుతారు.

సుబ్బారెడ్డి, విజయలక్ష్మి దంపతులు సింపుల్‌గా ఉన్నా కర్నూలు శివారులోని సుబ్బారెడ్డి ఫార్మసీ అండ్ ఇంజినీరింగ్ కళాశాలకు అధిపతులు. కరస్పాండెంట్ హోదాలో బిజిబిజీగా ఉండటం వల్ల మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి వరకు విజయలక్ష్మి రోజుకు 20 నుంచి 30 కప్పుల కాఫీ తాగుతారు. మార్నింగ్ టు ఈవెనింగ్ వరకూ చాలా హుషారుగా ఉంటారని, మేడమ్ ఎనర్జిటిక్‌గా ఉండటం ఆశ్యర్చం వేస్తోందని కాలేజి సిబ్బంది చెబుతున్నారు.

అనారోగ్యానికి గురైతే కడుపునిండా తిన్నాక మందులు వేసుకోవాలి. కానీ ఈవిడ కాఫీ తాగే మెడిసిన్స్ వేసుకుంటారు. ఇక కర్నూలు, ఆదోని, నంద్యాలలో ప్రతి సోమవారం జరిగే ప్రజాదర్బార్‌కు వచ్చే వందలాదిమంది రైతులకు విజయలక్ష్మి దంపతలు ఉచితంగా భోజనం పెడుతూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఘనపదార్దాలు తీసుకోనంత మాత్రాన ఆరోగ్యానికి ఎటువంటి సమస్యలు రావని డాక్టర్లు చెప్తున్నారు. చిక్కటి పాలు, టీ పొడి మిశ్రమాన్ని కాఫీ రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషక పదార్దలు అందుతాయంటున్నారు. కాఫీతో ముడిపడిన విజయలక్ష్మి జీవితం గురించి తెలుసుకున్న వారు ఒకింత ఆశ్చర్యానికి గురైతే, రైతులకు అన్నదానం సేవా కార్యక్రమాన్ని చూసి అభినందనల ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు అభిమానులు.

పనిపాటలు...చాలా యాక్టివ్

కాఫీనే ఆహారం...ఎందుకలా?

మార్చేందుకు...భర్త ప్రయత్నం

Show Full Article
Print Article
More On
Next Story
More Stories