తప్పతాగి చిందులేసిన యువతులు.. పోలీసులు వచ్చి..

Submitted by nanireddy on Wed, 10/03/2018 - 16:51
4-women-attack-cops-in-mumbai-after-drunken-night-out-in-mumbai

యువకులే కాకుండా  యువతులు సైతం మద్యం సేవించి రోడ్లపై నానా రభస చేస్తున్నారు. తాజాగా ముంబై నగరంలో నలుగురు అమ్మాయిలు తప్పతాగి రోడ్డపై చిందేలేశారు. పైగా ఒకరికొకరు గొడవ పడుతు రోడ్డుపై వెళ్లే వాహనాలు ఆపుతూ అడిగిన వారిపై చేయిచేసుకుంటున్నారు. దాంతో కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి  వచ్చి నిలదీశారు. కానీ మద్యం మత్తులో ఉండటం వలన వారు పోలీసుల మాట అస్సలు వినలేదు. దాంతో ఆడపోలీసులను రప్పించి బలవంతంగా స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. దాంతో మహిళ ఇన్‌స్పెక్టర్‌పై దాడి చేయడానికి ప్రయత్నించారు. మిగతా పోలీసుల పైన దుర్భాషలాడుతూ వారిషర్ట్ బటన్లు బ్యాడ్జీలను లాగేందుకు యత్నించారు. దీంతో ఎలాగలగో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. నలుగురు అమ్మాయిలను మమతా మెహార్, అలీషా పిైళ్లె కమల్, శ్రీవాత్సవ, జెస్సీ డీ కోస్టా లుగా గుర్తించారు. వీరిలో డీ కోస్టా పోలీసులనుంచి తప్పించుకున్నారు. 

English Title
4-women-attack-cops-in-mumbai-after-drunken-night-out-in-mumbai

MORE FROM AUTHOR

RELATED ARTICLES