కుప్పకూలిన హోర్డింగ్‌.. నలుగురి మృతి

Submitted by arun on Sat, 10/06/2018 - 11:53
metal hoarding crashes

పూణెలో విషాదం జరిగింది. శివాజీనగర్ రైల్వేస్టేషన్ పరిధిలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వేచి ఉన్న వాహనాలపై ఒక్కసారిగా హోర్డింగ్ కూలిపడింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా, మరో పది మంది తీవ్రగాయాల పాలయ్యారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ ప్రమాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదంలో ఆరు ఆటోరిక్షాలు, మూడు టూ వీలర్స్ కూడా ధ్వంసమయ్యాయి.  హోర్డింగ్‌లు తొలగించాలని 2013 నుంచి వివిధ వర్గాల నుంచి వినతులు వస్తున్నా అధికారుల్లో స్పందన లేకపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

English Title
4 killed as metal hoarding crashes on traffic in Pune

MORE FROM AUTHOR

RELATED ARTICLES