వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్లు

Submitted by admin on Sun, 09/10/2017 - 21:26
  • వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్లు

యూజర్స్‌కు సరికొత్త ఫీచర్లతో మరింత మెరుగైన సేవలందిస్తున్న వాట్సాప్ మరో రెండు కొత్త ఫీచర్లను ప్రకటించింది. అందులో మొదటిది పిక్చర్ ఇన్ పిక్చర్ ఫీచర్. వాట్సాప్‌లో వీడియో కాల్ చేసినప్పుడు మెసేజ్ చేసేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ అలా మెసేజ్ చేసినా వీడియో కాల్‌కు అంతరాయం కలుగుతుంది. ఈ కొత్త ఫీచర్ వల్ల వీడియో కాల్‌లో ఉన్నప్పుడు కూడా ఇతరులకు మెసేజ్ చేయవచ్చు. ఏకకాలంలో వీడియో కాల్‌ను, మెసెంజింగ్ సేవలను అందించడమే ఈ ఫీచర్ ప్రధాన ఉద్దేశం. అయితే ప్రస్తుతానికి ఈ సౌకర్యం ఆండ్రాయిడ్ 8 ఓస్ ఫోన్లను వినియోగిస్తున్న వారికి మాత్రమే అందుబాటులోకి రానున్నట్లు సంస్థ తెలిపింది. మరో ఫీచర్‌ను టెక్ట్స్ ఓన్లీ స్టేటస్ అప్‌డేట్స్ పేరుతో విడుదల చేసింది. ఇప్పటివరకూ యూజర్స్ వీడియో కానీ.. ఫొటో గానీ స్టేటస్‌గా పెట్టేందుకు వీలుంది. ఈ ఫీచర్ ద్వారా టెక్ట్స్‌ను కూడా స్టేటస్‌గా పెట్టుకునే అవకాశం కల్పించారు. అంతేకాదు, ఆ టెక్ట్స్‌కు మంచి బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఫేస్‌బుక్‌లో ఈ తరహా ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ టెక్ట్స్ స్టేటస్‌కు 24 గంటలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. వీటితో పాటు వాట్సాప్ ఫర్ బిజినెస్ పేరుతో ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

 

English Title
Two new features in Whatsapp

MORE FROM AUTHOR

RELATED ARTICLES