టీఆర్ఎస్ విజయం వెనుక ఆ ముగ్గురూ కీలక పాత్ర

టీఆర్ఎస్ విజయం వెనుక ఆ ముగ్గురూ కీలక పాత్ర
x
Highlights

ఒక పక్క ప్రజా కూటమి మరో పక్క బీజేపీ ముప్పేట దాడి సినీ గ్లామర్‌తో జాతీయ స్థాయి నాయకులతో ప్రచారం ఇవేవీ టీఆర్ఎస్ ప్రభంజనాన్ని అడ్డుకోలేక పోయాయి స్టార్...

ఒక పక్క ప్రజా కూటమి మరో పక్క బీజేపీ ముప్పేట దాడి సినీ గ్లామర్‌తో జాతీయ స్థాయి నాయకులతో ప్రచారం ఇవేవీ టీఆర్ఎస్ ప్రభంజనాన్ని అడ్డుకోలేక పోయాయి స్టార్ కాంపైనర్ ని నమ్మని కేసీఆర్ కుటుంబ బలంతో జెట్ స్పీడ్ లో దూసుకుపోయారు.. వ్యూహాత్మకంగా వ్యవహరిచి విజయం అందించారు టీఆర్ఎస్ విజయం వెనుక ఆ ముగ్గురూ కీలక పాత్ర పోషించి అఖండ మెజార్టీని అందించారు.

రాజకీయాల్లో కుటుంబ సభ్యులు పెరిగే కొద్దీ విభేదాలు ముదురుతాయి. చివరికి పార్టీ గెలుపు ఓటములను కూడా ఆవే శాసిస్తాయి. కానీ తెలంగాణ దీనికి భిన్నం కలిసి ఉంటే కలదు సుఖం అనట్లు కుటుంబ సభ్యులంతా ఒకటయ్యారు పార్టీని గెలిపించారు అధికారం సంపాదించారు అంచనాలకు అందకుండా, ప్రత్యర్థులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కేటీఆర్, కవిత, హరీష్‌రావు మూకుమ్మడిగా కలిసి పనిచేసి పార్టీని గెలిపించారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నికల్లో తండ్రికి తగ్గ తనయుడని కేటీఆర్ నిరూపించుకున్నారు తండ్రి తరహాలోనే మాటల తూటాలను పేల్చడంతోపాటు రాజకీయ వ్యూహరచనలోనూ భాగస్వామిగా వ్యవహరించారు. టీఆర్ఎస్ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ముందస్తు ఎన్నికల కసరత్తు కేసీఆర్ చేపట్టిన తర్వాత కేటీఆర్ పార్టీలో కీలక పాత్ర పోషించాడు అభ్యర్థుల ఎంపిక అనంతరం జరిగిన పరిణామాలను కొందరికి మళ్లీ టికెట్లు ఇవ్వడంపై ఇతర నేతల్లో ఉన్న వ్యతిరేకతను కేటీఆర్ జాగ్రత్తగా మేనేజ్ చేశారు అసమ్మతి నేతలను బుజ్జగించి, వారి సమస్యలను ప్రరిష్కరించి ప్రచారం నిర్వహించారు జంటనగరాల్లో 24, రాష్ట్ర వ్యాప్తంగా 46 నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు, రోడ్డు షోలు నిర్వహించి టీఆర్ఎస్ గెలుపులో కీలకంగా వ్యవహరించారు.

మరోవైపు టీఆర్ఎస్ అఖండలో కేసీఆర్ కూతురు నిజామాబాద్ ఎంపీ కవిత కూడా విజయంలో తన వంతు పాత్ర పోషించారు జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్‌లో సీనియర్ నేత జీవన్ రెడ్డిని ఓడించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్‌‌ రూరల్, నిజామాబాద్ అర్బన్, బోధన్‌, ఆర్మూరు, బాల్కొండ స్థానాలున్నాయి. వీటిలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి గులాబీ ప్రభంజనానికి తన వంతు చేయూతనందించారు. ఈ విజయ సాధనకు ఎంపీ కవిత రచించిన ప్రచార వ్యూహాలు, ఎన్నికల ప్రణాళికలు అద్భుత ఫలితాలనిచ్చాయి.

ఇక టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహంలో మంత్రి హరీష్ రావు కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి మెదక్‌లో పార్టీని పటిష్టం చేసిన హరీష్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌ వ్యవహారాలనూ దగ్గరుండి చూసుకున్నారు. నేతలు, కార్యకర్తలు, ప్రజలను ఎప్పటికప్పుడు కలిసి కేసీఆర్‌కు అనుకూలంగా మార్చారు. కేసీఆర్‌ నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చడంలో సఫలమయ్యారు సిద్దిపేట నియోజకవర్గంలో నిత్యం పర్యటిస్తూనే మరో 25 నియోజకవర్గాల బాధ్యతలను తనపై వేసుకున్నారు మెదక్‌ జిల్లాతోపాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో తీవ్రమైన పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఎన్నికల పర్యవేక్షణ హరీశ్‌ నేతృత్వంలో సాగింది. ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ, స్థానిక నేతలను సమన్వయం చేసుకుంటూ పార్టీ విజయానికి బాటలుపరిచారు. సిద్ధిపేటలో భారీ మెజారిటీతో విజయాన్ని అందుకోడమే కాకుండా పార్టీని కూడా గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. మొత్తానికి టీఆర్ఎస్ విజయంలో కేటీఆర్, కవిత, హరీష్ లు కీలకంగా వ్యవహరించి పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories