హైదరాబాద్‌లో భారీ సైబర్‌ మోసం

హైదరాబాద్‌లో భారీ సైబర్‌ మోసం
x
Highlights

హైదరాబాద్‌లో భారీ సైబర్‌ మోసం బయటపడింది. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలోని ముగ్గుర్ని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా...

హైదరాబాద్‌లో భారీ సైబర్‌ మోసం బయటపడింది. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలోని ముగ్గుర్ని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా నుంచి రెండున్నర లక్షల నగదు...కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో సైబర్‌ మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.

సైబర్ మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతో వల విసిరి....డబ్బు దండుకుంటున్నారు. నకిలీ వెబ్‌సైట్‌ క్రియేట్ చేసి...మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. దేశ రాజధాని ఢీల్లీ కేంద్రంగా ఘారానా మోసాలకు పాల్పడుతున్న ముఠాకు చెక్ పెట్టారు సైబర్ క్రైం పోలీసులు. ఢిల్లీకి చెందిన సచిన్ కుమార్, వికాస్ కుమార్, సుభాష్, వికాస్‌లు ముఠాగా ఏర్పడి....ఢిల్లీ కేంద్రంగా మోసాలకు తెర లేపారు. తెలంగాణ ఆగ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు ఉన్నాయని పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. జాబ్ అప్లికేషన్ ఫీజు, ప్రాసెస్‌ ఫీజుల పేరుతో పాటు అందినకాడికి లక్షల్లో దండుకున్నారు. ఓ ఫేక్ ప్రభుత్వ సైట్‌ను కూడా క్రియేట్ చేసి...20 మంది నుంచి తెలంగాణలో సుమారు 20 లక్షల వరకు వసూల్ చేశారు.

ఈ ముఠా సభ్యులు ఒక తెలంగాణలోనే కాదు...మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ ముఠా సభ్యులు సుమారు 2 కోట్ల వరకు వసూల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు, ముఠాలోని ప్రధాన నిందితుడు సచిన్ కుమార్ పరారీలోలో ఉండగా...ముఠా సభ్యులు వికాస్ కుమార్, సుభాస్, వికాస్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల నుంచి కంప్యూటర్, సెల్ ఫోన్లు, ప్రింటర్లు, నకిలీ జాబ్ పత్రాలు, 2 లక్షల 50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories